తెలుగు సత్తా చాటి చెప్పిన సినిమాలు చాలానే  ఉన్నాయి..అలనాటి హీరోల సినిమాలు అంటే మరచి పోని తీపి గుర్తులు ..ఒక్కో సినిమా అంటే ఒక్కో ఆణిముత్యం అని చెప్పాలి..ఎన్నో కష్టాలని ఎదుర్కొని , వరుస సినిమాలో నటిస్తూ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు అంతులేని అభిమానులను సంపాదించినా ఘనత ఒక్క చిరంజీవి మాత్ర.. అందుకే ఇప్పుడు మెగాస్టార్ అయ్యాడు.. 

 

 

 

 

మరో విషయమేంటంటే.. అలనాటి హీరోలను మళ్లీ తెర మీద గుర్తు చేయాలని చాలా మంది అనుకోని వారు సినిమాలు జీవిత విశేషాలు తలపించేలా వారి గురించి బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు..ఇప్పటికే చాలా బయోపిక్ లు వచ్చిన ఆ సినిమాలు ఏవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. ఇప్పుడు ఆ సినిమాలను మళ్లీ చూపించాలని దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.. 

 

 

 

 

 

 

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో బయోపిక్ లు ట్రెండ్ నడుస్తోంది.. స్టార్ హీరోల తో ఈ సినిమాలను తెరకెక్కించాలని అభిప్రాయపడుతున్నారు.. అసలు విషయానికొస్తే.. నందమూరి నట సింహం బాల కృష్ణ  స్వర్గీయ నటుడు తెలుగు దేశం స్థాపకుడు ఎన్టీఆర్ బయోపిక్ లను తెరకెక్కించాడు.  అందులో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకుల మన్ననలను అందుకోలేదు..

 

 

 

 

 

 

అయినా కానీ పెద్ద హీరోల సినిమాలను ప్రేక్షకులకు అందించాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు.. అలాంటిది తెలుగు హీరోలకు బ్రాండ్ ఐకాన్ మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ ను రూపొందించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.. అయితే ఆ సినిమాలో చిరంజీవి పాత్రకు న్యాయం ఎవరు చేస్తారు అంటే సాయి ధరమ్ తేజ్ పేరును మెగా అభిమానులు కోరుకుంటున్నారు.. అతను చూడటానికి అచ్చం మేనమామ లాగే ఉండటంతో అతనితో ఈ సినిమా చేస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.. మరి ఈ సినిమా పై క్లారిటీ రావాలంటే సినిమా మొదలయ్యి వరకు ఆగాల్సిందే..

 

మరింత సమాచారం తెలుసుకోండి: