ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఏ చిన్న విషయం అయినా సరే రచ్చ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ గురించి ఇది కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు.  వారు ఏం మాట్లాడినా.. ఏ పని చేసినా ఇట్టే వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇప్పుడు తమిళ నటుడు విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.  దక్షిణాదిన ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంటున్న విజయ్ సేతుపతి హిందూ దేవుళ్లకు జరిగే అభిషేకం, అలంకరణ, కైంకర్యాలను తప్పుబడుతూ ఓ టీవీ చానల్‌లో సినీ నటుడు విజయ్ సేతుపతి ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా, ఆయన వ్యాఖ్యలపై అఖిల భారత హిందూ మహాసభ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు లేఖ రాసింది. 

 

మత విశ్వాసాల గురించి ఎవరూ తమకు ఇష్టమున్న వ్యాఖ్యలు చేస్తే కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటాయని.. ఒక సెలబ్రెటీ అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే దాని ప్రభావం తీవ్ర తరంగా ఉంటుందిని వారి ఆరోపణ. అఖిల భారత హిందూ మహాసభ  విజయ్ సేతుపతిపై అఖిల భారత హిందూ మహాసభ ఆగ్రహం వ్యక్తి చేస్తుంది.  అంతే కాదు వెంటనే  కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇలా వ్యాఖ్యలు చేయడం వల్ల మరికొంత మంది ఇలాంటి మాటలు అనడానికి ఆస్కారం ఉంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

విజయ్ వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఆయన ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందని నిలదీసింది. సొంత ప్రచారం కోసం హిందూ మతమే దొరికిందా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు, నెటిజన్లు కూడా విజయ్ సేతుపతిపై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే విజయ్ సేతు పతి చేసిన వ్యాఖ్యపై నెటిజన్లు సైతం రక రకాలుగా ట్రోలింగ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: