పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మామూలుగానే సూపర్ డైలాగ్స్ రాసే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ అంటే ఇంకాస్తా బాగా... వినాసంపుగా ఉండేలా డైలాగ్స్ రాస్తారు.. అందుకే వాళ్ళ కాంబినేషన్ మూవీస్ వస్తే థియేటర్స్ లో డైలాగ్స్ కి విజిల్స్... అరుపులు వినిపిస్తాయి.. ఎందుకంటే ఆ డైలాగ్స్ కేవలం వినడానికే కాదు.. ఆలోచించేలా కూడా ఉంటాయి.. అలాంటి అద్భుతమైన డైలాగ్స్ లో కొన్ని డైలాగ్స్ ఇక్కడ ఉన్నాయ్.. అవి ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 

1. ఒక మనిషికి ఉంటే కోపం, అదే కోపం ఒక గుంపుకి ఉంటె ఉద్యమం. 

 

2. యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, ఓడించడం.      

 

3. అందంగా ఉండడం అంటే మనకు నచ్చేలా ఉండడం, ఎదుటి వాళ్ళకి నచ్చేలా ఉండడం కాదు.      

 

4. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు.

 

5. తెగిపోయేటప్పుడు ధరమ్ బలం తెలుస్తుంది... విడిపోయేటప్పుడు బంధం విలువ తెలుస్తుంది.            

 

6. ఒకసారి చెయ్యి పట్టుకుంటే చచ్చేటప్పుడే వదలడం, మధ్యలో వదలడం కాదు.               

 

7. కారణం లేని కోపం, గౌరవం లేని ప్రేమ, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకాలు లేని  వృధ్యాప్యం అనవసరం. 

 

8. అందంగా లేదని అమ్మని, కోపంగా ఉన్నాడని నాన్నని వదిలెయ్యలేం కదా!              

 

9. బాగుండడం అంటే బాగా ఉండడం కాదు, నలుగురితో ఉండడం.. నవ్వుతు ఉండడం.                

మరింత సమాచారం తెలుసుకోండి: