ఫిదా సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టి తన అందచందాలతో కుర్రకారును తిప్పుకున్న మళియాల బ్యూటీ సాయి పల్లవి పుట్టినరోజు నేడు. సాయిపల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా పక్కింటి అమ్మాయిలా కనిపించే సాయిపల్లవి తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయింది. అయితే సాయి పల్లవి మీద కొందరు హీరోలు కంప్లైంట్ చేసిన చివరకు తన నటనతో అవన్నీ పక్కకు నెట్టేసేలా చేసుకుంది సాయి పల్లవి. 

 


అయితే ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా... అనేక మంది సోషల్ మీడియా ద్వారా సాయి పల్లవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యంగా సినీ రంగం ప్రముఖులు కూడా సాయి పల్లవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అసలు విషయానికి వస్తే... మలయాళీ ముద్దుగుమ్మ సాయి పల్లవికి పుట్టినరోజు సందర్భంగా దగ్గుబాటి రానా తన ట్విట్టర్ ద్వారా " విరాటపర్వం " చిత్రంలోని సాయి పల్లవికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేస్తూ తన తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ పోస్టర్ లో సాయి పల్లవి ఒక స్థూపం దగ్గర బ్యాగ్ తో కూర్చొని ఉంది. అయితే ఇప్పుడు ఈ పోస్టర్ సాయి పల్లవి అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.


సాయి పల్లవి, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా " విరాటపర్వం" . ఈ సినిమాకు వేణు దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ మరో నటి ప్రియమణి కీలక పాత్ర ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సినిమాను సుధాకర్, డి.సురేష్ బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఒక సామాజిక సమస్యను తెలుపుతూ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ పోరాట ఘట్టాల్ని హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ స్టీఫెన్ రిచర్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. అయితే ఈ విరాటపర్వం సినిమాలో సాయి పల్లవి ఒక నక్సలైట్ గా కనిపించ బోతుందని వార్త.

మరింత సమాచారం తెలుసుకోండి: