తెలుగు సినిమా లెజెండ్స్‌లో అక్కినేని నాగేశ్వర రావు ఒకరని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకానొక సందర్భంలో చిత్ర సీమని ఏలిన నటుల్లో అక్కినేని నాగేశ్వరావు ఒకరు. ఏఎన్నార్ మృతి అనంతరం ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ వస్తే బాగుంటుందని అక్కినేని అభిమానుల కోరుకుంటున్నారు.తెలుగు చిత్రపరిశ్రమకి ఎన్టీ రామారావు .. అక్కినేని నాగేశ్వరరావు రెండుకళ్లు అని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. ఇద్దరూ కూడా విభిన్నమైన .. విలక్షణమైన పాత్రల్లో అశేష ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.నాగేశ్వరరావు గారు వారి నటన ప్రభావాలతో అనేక అవార్డులని కొల్లగొట్టారు.

 

 అలాంటి ఈ మహానటులలో ఎన్టీ రామారావు గారి  బయోపిక్  ను కొడుకు బాలకృష్ణ నటించి ప్రేక్షకుల కోరికను తీర్చారు.అయితే నాగేశ్వరావు గారు చనిపోయాక అయన బయోపిక్ మాత్రం ఇప్పటిదాకా ఇంకా రూపుదిద్దుకోలేదు. సినీ ఇండస్ట్రీ కి మకుటం లేని మహారాజు ఏ ఎన్నార్ గారు. అలాంటి గొప్ప నటుడు యొక్క జీవిత చరిత్రని సినిమా రూపంలో తీస్తే చూడాలని ఎందరో  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

నాగేశ్వరావు గారి వారసుడిగా అక్కినేని నాగార్జున కూడా అందరికి  సుపరిచితమే. నాగేశ్వరావు మనవాళ్లుగా నాగ చైతన్య, అఖిల్ కూడా సినీ రంగంలో ప్రవేశించారు.. కొడుకు, మనవాళ్లతో కలిసి మనం అన్నా సినిమాలో నటించారు నాగేశ్వరావు.అదే అయన చివరి సినిమా.అంతా పెద్ద వయసులో కూడా నటించి ప్రేక్షకులు మనసు గెలిచారు. అయితే అయన కుటుంభ సభ్యుల్లో వాళ్ళు ఎవరన్నా నాగేశ్వరావు గారి జీవిత చరిత్ర సినిమా రూపంలో తీస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

 

అయితే ఈ  బయోపిక్లో  యంగ్ ఏఎన్నార్ గా మనవడు అయిన నాగ చైతన్య,  ఆ తరువాత దశలో ఏఎన్నార్ గా కొడుకు అయిన  నాగర్జున కనిపిస్తే బాగుంటుందని అటు అభిమానులు ఇటు సినీ విశ్లేషకులు అనుకుంటున్నారు. తెలుగు ఇండస్ట్రీ ని ఇంత  గొప్ప స్థాయిలో నిలబెట్టిన అక్కినేని నాగేశ్వరావు జీవిత చరిత్ర కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: