తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీడేస్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన తమన్నా తర్వాత తెలుగు, తమిళంలో మంచి క్రేజ్ సంపాదించింది.  స్టార్ హీరోల సరసన నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం పొందింది. తెలుగు, తమిళ్ లో మంచి క్రేజ్ సంపాదించిన ఈ మిల్కీ బ్యూటీ బాలీవుడ్ లో తన సత్తా చాటాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది.  ఈ నేపథ్యంలో  తొలి చిత్రంగా 'హిమ్మత్ వాలా' లో నటించింది.  ఈ మూవీలో అజయ్ దేవగాన్ హీరోగా నటించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగు, తమిళ్ లో మంచి పేరు సంపాదించాను.. ఇదే సమయంలో బాలీవుడ్ లో కూడా నటించాలనే కొరికతో ‘హిమ్మత్ వాలా’ చిత్రంలో నటించాను. ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాని.. కానీ  ఆ చిత్రం ఆశించినస్థాయిలో ఆదరణ పొందలేకపోయింది.

 

దాంతో నేను చాలా డీలాపడిపోయాను. ఆ సమయంలో ఇతర భాషా చిత్రాలతో నేను బిజీగా ఉండటం వలన, ఆ చిత్రం పరాజయం నన్ను ఎక్కువకాలం పాటు వెంటాడలేకపోయింది.  ఎందుకంటే ఒక చిత్రం ఒప్పుకోవాలంటే.. కథ ఎంత బలంగా ఉందన్న విషయంపై స్టడీ చేయాలని.. ఎదో నటించాలి అంటూ తొందరపడి నటించడం చాలా పొరపాటు అన్న విషయం గ్రహించానని చెప్పింది తమన్నా.  

 

ఒక కథను ఒప్పుకోవడానికి ముందు ఎంతలా ఆలోచించాలి .. ఒక పాత్ర చేయడానికి ముందు ఆ పాత్రను గురించి ఎంతవరకూ తెలుసుకోవాలి వంటి విషయాలు నాకు అర్థమయ్యాయి. అప్పటి నుంచి కెరియర్ పరంగా నేను జాగ్రత్త పడటానికి ఆ చిత్రం నాకు చాలా హెల్ప్ అయింది. అందువలన ఆ సినిమా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది' అని చెప్పుకొచ్చింది. ఈ అమ్మడు తర్వాత ప్రభుదేవతో నటించిన అభినేత్రి మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. కాకపోతే అభినేత్రి సీక్వెల్ మత్రం పెద్దగా మెప్పించలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: