టాలీవుడ్ ఇండస్ట్రీలో బర్నింగ్ స్టార్ గా కొనసాగుతూ అందరిలో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం చిత్రంతో ఆయన టాలీవుడ్లోకి రంగ ప్రవేశం చేసి వరుస సినిమాలను చేస్తూ వచ్చాడు. హిట్టు, ఫ్లాప్ అని తేడా లేకుండా తాను నటన పై ఉన్న ఆసక్తితో సినిమాలు చేస్తూ వచ్చాడు సంపూర్ణేష్ బాబు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఏదైనా విపత్కర విషయం జరిగితే సహాయం అందించడంలో కూడా సంపూర్ణేష్ బాబు ఒక అడుగు ముందే ఉంటాడు. తనకు ఉన్నంతలో సహాయం చేయడానికి ముందుకు వచ్చే వ్యక్తి సంపూర్ణేష్ బాబు. సంపూ చివరిగా కొబ్బరి మట్ట చిత్రంలో మూడు విభిన్న పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల్ని పలకరించాడు.


తాజాగా ఒక మెడికల్ హర్రర్ చిత్రంతో పలకరించేందుకు మన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సిద్ధమయ్యాడు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చైనా దేశంలోని వూహాన్ గబ్బిలాల మార్కెట్ లో చిత్రీకరించిన చివరి సినిమా అని చిత్ర టీం తెలుపుతోంది.  నొలన్ మౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా విదేశాల్లో అత్యంత భారీ బడ్జెట్ తో, భారీ గ్రాఫిక్స్ తో రూపొందించినట్టు హీరో సంపూర్ణేష్ బాబు తెలిపారు. ఇక అలాగే సంపూర్ణేష్ బాబు ఆ చిత్ర టైటిల్ ఏంటి అనేది వదిలేశారు. ఈ సినిమా గాను పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు.


చైనాలోని వూహాన్ నగరంలో సముద్ర జీవులను అమ్మే మార్కెట్ నేపథ్యంలో ఈ కరోనా మహమ్మారి పుట్టినట్లు మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ మార్కెట్ పై సంపూర్ణేష్ బాబు చేస్తున్న ఈ చిత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే. ఇక ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి తెలపడం జరిగింది. అంతే కాకుండా అందరి హీరోల అభిమానుల తరపున నాకు నేనే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సదా మీ ప్రేమకు బానిస అంటూ సంపూర్ణేష్ బాబు తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: