చెన్నై చిన్నది సమంత పెళ్లి అయినా కూడా సినిమాల్లో నటిస్తూ హిట్లు మీద హిట్ కొడుతూ దూసుకుపోతోంది. సమంత పెళ్లయ్యాక కూడా భర్త నాగచైతన్య తో కలిసి నటించిన మజిలీ సినిమా తో పాటు.... ఓ బేబీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ కూడా సమంతకు స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా మంచి అవకాశాలు వస్తున్న సంగతి తెలిసిందే. అటు తన మామ నాగార్జునతో కలిసి ఆమె రాజు గారి గది 2 సినిమాలో కూడా నటించింది గత కొద్ది రోజులుగా మామ కోడలు మధ్య చిన్నపాటి అభిప్రాయబేధాలు తలెత్తినాయ‌ని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పెళ్లయ్యాక కూడా నటిస్తానని సమంత అక్కినేని ఫ్యామిలీ తో ముందే ఓకే చేయించుకున్నా రొమాన్స్ విషయంలో మాత్రం కాస్త హద్దులు దాటుతుంది అన్న‌ అభిప్రాయం అందరిలో ఉంది.

 

రంగ‌స్థ‌లం సినిమాలో రామ్ చ‌ర‌ణ్ తో స‌మంత చేసిన లిప్ లాక్ ఎంత ర‌చ్చ ర‌చ్చ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ఇప్పుడు పెళ్ల‌య్యాక కూడా స‌మంత‌కు చాలా అవ‌కాశాలే వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే రొమాన్స్ పరంగాను.. లిప్ లాక్ ల ప‌రంగాను ద‌ర్శ‌క నిర్మాత‌లు కాస్త ఓపెన్ గానే ఉండాల‌ని చెపుతున్నార‌ట‌. ఇటు స‌మంత‌కేమో రొమాన్స్ ఓవ‌ర్ అయినా సినిమాల్లో ఇంకా కంటిన్యూ అవ్వాల‌న్న ఉద్దేశం ఉంది. ఈ విష‌యంలో చైతు కాస్త చూసి చూడ‌న‌ట్టు వ్య‌వహ‌రిస్తున్నా నాగ్ మాత్రం ఈ విష‌యంలో సీరియ‌స్ గానే ఉన్నాడ‌న్న వార్త‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. 

 

పెళ్ల‌య్యాక కాస్త పద్ధ‌తిగానే ఉండాల‌ని.. ఈ విష‌యంలో హ‌ద్దులు దాటితే చూస్తూ ఊరుకునే ప్ర‌స‌క్తే లేద‌ని నాగ్ స‌మంత‌కు సీరియ‌స్‌గానే చెప్పేశాడ‌ట‌. ఇప్పుడు ఈ విష‌యం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో బాగా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మ‌రి దీనిపై స‌మంత తో పాటు అటు అక్కి నేని ఫ్యామిలీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో ?  చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: