ప్రస్తుతం లాక్ డౌన్   నేపథ్యంలో సినిమా షూటింగ్ లన్ని  ఆగిపోవడంతో సినీ సెలబ్రిటీలు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే  సినీ సెలబ్రిటీలు ప్రస్తుతం లాక్ డౌన్  నేపథ్యంలో ఖాళీగా ఉండడంతో ఈ దొరికిన సమయానికి కాస్త ఫిట్నెస్ పై  దృష్టి పెడుతున్నారు. ఫిట్నెస్ పెంచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. అయితే  సెలబ్రిటీలు ఫిట్ నెస్ కు సంబంధించిన వర్కౌట్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న  విషయం తెలిసిందే. అయితే తాజాగా కరీనా కపూర్ కి సంబంధించిన ఫిట్నెస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే మరీ అంతగా ఎందుకు వైరల్ అయ్యింది అంటారా... అయితే ఈ వీడియోలో  కేవలం కరీనా కపూర్ ఖాన్ మాత్రమే వర్కౌట్ చేయట్లేదు.... తన భర్త సైఫ్ అలీఖాన్ మాజీ భార్య అమృత కూడా కరీనా కపూర్ తో  వర్కౌట్లు చేస్తుంది. 

 

 దీంతో ఇది కాస్త నెటిజన్లను  బాగా ఆకర్షిస్తుంది. కరీనాకపూర్ అమృత ఫ్రెండ్షిప్ గోల్స్  అంటూ ఈ  వీడియో ప్రస్తుతం నెట్టింట్లో  హల్చల్ చేస్తోంది. అయితే దీనిపై కూడా భిన్నంగా స్పందిస్తున్నారు నెటిజన్లు . లాక్ డౌన్ లో  కూడా ఒకరినొకరు కలుసుకుంటున్నారు అంటూ కొంతమంది కామెంట్ పెడితే ... ఇంకొంతమంది ఇద్దరి మధ్య  ఫ్రెండ్షిప్ బాగుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. 

 


 అయితే ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ మాజీ భార్య భర్త..ప్రస్తుత  భార్య కలిసి చేస్తున్న వర్కౌట్ వీడియో మాత్రం  సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అయితే మామూలుగానే సినీ సెలబ్రిటీలు విడిపోయినప్పటికీ వారి మధ్య మంచి స్నేహ బంధం మాత్రం ఉంటుంది అనే విషయం తెలిసిందే. తాజాగా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళు  విడిపోయినప్పటికీ స్నేహబంధం మాత్రం ఎప్పటికీ కొనసాగుతుంది అనే దానికి నిదర్శనం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: