టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఇటు తెలుగు బుల్లితెర మీద మహిళా యాంర్ల‌కు ఉన్న ప్రత్యేకమైన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఎంతమంది యాంకర్లు వ‌స్తున్నా పోతున్న పోతున్నా మాత్రం రెండు దశాబ్దాలకు పైగా తిరుగులేని యాంకర్‌గా సుమ కొన‌సాగు తోంది.  

 

అటు వెండి తెర కార్యక్రమాలతో పాటు ఇటు బుల్లితెర కార్యక్రమాలను ఒంటి చేత్తో చేస్తూ యాంక‌రింగ్ రంగంలో మ‌కుటం లేని మహారాణిగా కొనసాగుతూ వ‌స్తోంది. ఆమె జీవితానికి సంబంధించి ఎన్ని పుకార్లు షికార్లు ఇటీవ‌ల వచ్చినా ఆమె గ్రాస్ ఎంత మాత్రం తగ్గ‌దు. ఇక సుమ సంగ‌తి కాసేపు ప‌క్క‌న పెడితే తెలుగు బుల్లితెర రంగంలో హాట్ యాంకర్ అనే పదానికి ప్రత్యేకమైన నిర్వ‌చ‌నం తెచ్చిన ఘ‌న‌త మాత్రం అన‌సూయ‌దే.

 

ఇక ఆ త‌ర్వాత ర‌ష్మి, మంజూష‌, స‌మీరా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది యాంక‌ర్లు వ‌చ్చినా సుమ‌కు స‌మే సాటి. ఇక ఇప్పుడు ఓ స‌రికొత్త వార్త ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఇన్న‌ర్  గా వినిపిస్తోంది. సుమ వ‌ర్సెస్ అనసూయ మ‌ధ్య ఇప్పుడు వార్ న‌డుస్తోంద‌ట‌. లాక్ డౌన్ తర్వాత తాను ఎక్కువ డిమాండ్ చేయను సుమా ఎక్కువ షోలు అడుగుతోంద‌ట‌. అంటే సుమ ఇప్పుడు ఎక్కువ రెమ్యున రేష‌న్ తీసుకునే యాంక‌ర్ల‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. అయినా ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమెకే ఎక్కువ ఛాన్సులు ఇస్తున్నారు.

 

ఒక వేళ ఇప్పుడు తన రెమ్యున‌రేష‌న్ త‌గ్గించు కుంటే అన‌సూయ చేసే షోలు కూడా ఆమెకే వెళ్లి పోనున్నాయ‌ట‌. అంటే అన‌సూయ కు భారీ ఎదురు దెబ్బ త‌ప్ప‌ద‌న్న మాట‌. అదే జ‌రిగితే అన‌సూయ క‌నిపించి  హంగామా చేసే షోలు అన్ని కూడా సుమ చేతుల్లోకి వెళ్లి పోతాయి. అప్పుడు ఆ షో ల‌లో కూడా సుమ హంగామానే ఉంటుంది. అందుకే ఇప్పుడు సుమ ప‌రోక్షంగా త‌న ప్రోగ్రామ్స్ కు ఎస‌రు పెడుతుంద‌న్న భావ‌న‌లో అన‌సూయ ఉంద‌ని .. దీని వ‌ల్ల ఇద్ద‌రి మ‌ధ్య అపార్థాలు పెరిగాయ‌ని అంటున్నారు. మ‌రి ఇందులో వాస్త‌వాలేంటో వారిద్ద‌రికే తెలియాలి.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: