టాలీవుడ్ లో ఇప్పుడు హీరోలు అందరూ కూడా కథలను ఎంపిక చేసే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. చిన్న హీరోలు పెద్ద హీరోలు అందరూ కూడా ఇప్పుడు కథలను రెడీ చేయించే పనిలో ఉన్నారు. భవిష్యత్తు సినిమాల మీద దృష్టి పెడుతున్న హీరోలు ఇప్పుడు ఈ విధంగా కష్టపడుతున్నారు. చిన్న హీరోలు అయితే పెద్ద దర్శకులతో సినిమాలు చేయడానికి గానూ ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఎంతగా ఫలిస్తాయో తెలియదు గాని ఎవరికి వారుగా కష్టాలు పడుతున్నారు. ఇక నానీ విషయానికి వస్తే ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి గానూ తీవ్రంగా కష్టపడుతున్నాడు. 

 

చిన్న హీరోలతో ఇప్పటి వరకు త్రివిక్రమ్ సినిమా చేయలేదు. అయితే ఎన్టీఆర్ తో చేసే సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉండటం తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. దీనితో ఇప్పుడు నానీ ఈ అవకాశాన్ని వాడుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నాడు. త్రివిక్రమ్ వద్ద కథ కూడా రెడీ గా ఉందని తనకు సన్నిహిత రచయిత వద్ద కథకు మెరుగులు దిద్దే ప్రయత్నాల్లో ఉన్నాడు అని సమాచారం. ఇప్పుడు ఈ సినిమా కోసం నానీ చాలా కష్టపడుతున్నాడు. నానీ తో త్రివిక్రమ్ ఇప్పటికే చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. 

 

ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా కథ కూడా దాదాపుగా సిద్దమైంది అని సమాచారం. ఇక ఈ సినిమా నిర్మాతగా నితిన్ లేదా హారిక అండ్ హాసిని ఉండే అవకాశం ఉందని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమాను సంక్రాంతి కి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం జరుగుతుంది. త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా కోసం నానా కష్టాలు పడుతున్నాడు. ఎన్టీఆర్ కథ మార్చమని చెప్పినట్టు తెలుస్తుంది. అందుకే ఇప్పుడు కథ మారుస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: