టాలీవుడ్ లో ఇప్పుడు హీరోలు అందరూ సినిమాలు లేక ఖాళీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఎవరికి వారు గా ఇప్పుడు కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నారు. సరికొత్తగా ఆలోచన చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొందరు యాక్టివ్ గా ఉంటున్నారు. మరి కొందరు ఇప్పుడు తమ వంతుగా ఏదోక ప్రయత్న౦ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా వీడియో లు షేర్ చేస్తూ తమ వంతుగా ప్రయత్నం జనాలను అలరించేందుకు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో హీరోలు అందరూ కూడా సేవా కార్యక్రమాల దిశగా అడుగులు వేస్తున్నారు. 

 

హీరోలు తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరంగా చూస్తే 24 జిల్లాలు ఉంటాయి. ఈ 24 జిల్లాలకు గానూ స్టార్ హీరోలు ఒక్కొక్కరు రెండు జిల్లాలను తీసుకుని కోటి మాస్క్ లను పంపిణి చేసే ఆలోచనలో ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. జిల్లాకు కోటి మాస్క్ లను లక్ష్యంగా పెట్టుకున్నారు. 24 జిల్లాలకు గానూ కనీసం 10 కోట్ల మాస్క్ లను తయారు చేయించి వాటిని పంపిణి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు మాస్క్ లను అందించే ప్రయత్నం చేస్తున్నారు. 

 

కరోనా కట్టడి లో మాస్క్ అనేది చాలా అవసరం. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తుంది. చిరంజీవి, నాగార్జున దీని మీద ప్రణాళిక సిద్దం చేసి ఇప్పుడు మాస్క్ లను అందించడానికి సిద్దమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణా సర్కార్ తో చిరంజీవి మాట్లాడినట్టు సమాచారం. త్వరలోనే మాస్క్ ల పంపిణి కార్యక్రమాని కి శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి. దీని తయారి డ్వాక్రా మహిళలకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే హీరోలు అందరూ కూడా కరోనా సాయం కింద తమ వంతుగా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: