కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమవడంతో పలువురు క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు. అనుకోని విధంగా వచ్చిన ఈ హాలిడేస్ కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తూనే లాక్‌ డౌన్‌ వేళ తమ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. అలాగే డేవిడ్ వార్న‌ర్ చాలాకాలంగా టిక్‌ టాక్‌ తోపాటు ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సోషల్ మీడియా మాధ్యమాలలో అభిమానులకు టచ్ లో ఉంటూ వస్తున్నాడు. లాక్‌ డౌన్‌ విధించినప్పటి నుంచీ తరచూ ఏదో ఒక వీడియోతో ఇన్‌స్టాగ్రామ్‌ లో అభిమానులను సంతోష పెడుతున్నాడు మన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్ వార్నర్. ఎప్పుడూ క్రికెట్ గ్రౌండ్ లో పరుగుల వరద పారించే ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ ఇప్పుడు తన భార్యతో కలిసి స్టెప్పులేస్తున్నాడు. తాజాగా ఒక పాట‌కు త‌న భార్య క్యాండిస్‌, కూతురు తో క‌లిసి స్పెప్పులేసిన వీడియో వైరల్ అయింది.

 

మొన్న అల వైకుంఠపురంలో సినిమాలోని బుట్ట బొమ్మ పాటకు స్టెప్పులు ఇరగదీసిన వార్నర్‌.. తాజాగా తమిళ సాంగ్‌ సన్నజాజి పడక పాటకి డ్యాన్స్‌ చేశాడు. తన భార్య క్యాండీస్‌తో కలిసి ఈ సాంగ్‌ కు టిక్‌టాక్‌ చేశాడు. ముందు వరుసలో కూతురు ఉండగా.. వెనకాల వార్నర్‌ - కాండీస్‌లు జంటగా కాలు కదిపారు. ఇది నిమిషాల్లో వైరల్‌ కావడం​తో అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ప్రధానంగా సౌత్‌ ఇండియా సినిమాల్లోని పాటలకు వార్నర్‌ టిక్‌టాక్‌ వీడియోలు చేయడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఇంకొన్ని వీడియోలు చేయాలంటూ వార్నర్‌ను కోరుతున్నారు. ‘వార్నర్‌.. నీ డ్యాన్స్‌తో మరొక స్టేజ్‌ను చూస్తున్నావు.. మాకు అంతే వినోదాన్ని అందిస్తున్నావు’ అని ఒక అభిమాని రిప్లై ఇవ్వగా, ‘వావ్‌.. థట్స్‌ అమేజింగ్‌ మేట్‌’ అంటూ మరొక అభిమాని పేర్కొన్నాడు. ‘ఈ కరోనా సంక్షోభంలో ఒకే ఒక్క క్రికెటర్‌ నాకు కావాల్సిన వినోదాన్ని ఇస్తున్నాడు’ అని వార్నర్‌ను కొనియాడాడు. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

We are back again!! #challenge #family #boredinthehouse #isolation @candywarner1

A post shared by David Warner (@davidwarner31) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: