భారతీయులకు రామాయణంకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. రామాయణాన్ని ఎవరు ఎప్పుడు తెరకెక్కించినా ఆదరణ ఉంటూనే ఉంటుంది. మూడు దశాబ్దాల క్రితం రామానంద్ సాగర్ తీసిన రామాయణం సీరియల్ ఎంతటి ప్రజాదరణ దక్కించుకుందో తెలిసిందే. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో ఈ సీరియల్ ని టెలికాస్ట్ చేస్తే వచ్చిన టీఆర్పీ రేటింగ్స్ చెప్తున్నాయి రామాయణంకు ఉన్న ఆదరణ ఏస్థాయిలో ఉందో. రామాయణాన్ని బాలీవుడ్ లో తెరకెక్కించే అంశం గతంలో వచ్చింది కానీ మళ్లీ చడీచప్పుడు లేదు. ప్రస్తుతం హిందీలో  రామాయణాన్ని సినిమాగా తీసే అంశం మళ్లీ వార్తల్లో నిలిచింది.

 

 

రామాయణం టీవీ సీరియల్లో సీతగా నటించిన దీపికా చికిలియా ఈ అంశంపై ఇటివల స్పందించింది. రామాయణంను హిందీలో సినిమాగా తీస్తే రాముడిగా హృతిక్ రోషన్ కరెక్ట్ గా సరిపోతాడని అభిప్రాయపడింది. నిండైన హృతిక్ రూపం రాముడిగా మెప్పించగలడని అంటోంది. సీతగా అలియా భట్ చక్కగా సరిపోతుందని వ్యాఖ్యానించింది. సీత పాత్రకు మరీ ఎత్తు ఉండకూడదు.. పైగా ఆమె హృతిక్ ఛాతీ వరకూ ఉంటుంది.. మోహం కూడా గుండ్రంగా ఉంటుంది కాబట్టి సీతగా ఆమె మాత్రమే ఫిట్ అంటోంది. లక్ష్మణుడిగా వరుణ్ ధావన్ సరిపోతాడని చెప్పుకొచ్చింది. వరుణ్ రూపం, మొహంలోని అమాయకత్వం లక్ష్మణుడిగా సరిపోతాడని చెప్పింది.

 

 

రావణుడిగా అజయ్ దేవ్ గణ్ ను తప్ప మరెవరినీ ఊహించలేనని అంటోంది. అజయ్ ఎత్తు, భారీ విగ్రహం, గాంభీర్యం ఆ పాత్రకు వన్నె తెస్తుందని తన అభిప్రాయాల్ని చెప్పుకొచ్చింది. దీంతో దీపికా వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. మరి ఈ అంశంపై బాలీవుడ్ మేకర్స్ ఆలోచన చేస్తారేమో చూడాల్సిందే. అప్పట్లో రాముడి పాత్రలో ఉన్న అరుణ్ గోవిల్ కు, సీత పాత్రలో ఉన్న దీపికాకు సీరియల్ మొదలవగానే టీవీకే హారతులు పట్టేవారు. అంతగా వారు ఆకట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: