అమ్మ ప్రేమ మాట‌ల్లో చెప్ప‌లేనిది. భగవంతుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడని అంటారు. అది అక్ష‌రాల నిజం. సృష్టిలో అత్యంత నిస్వార్థ జీవి ఎవరైనా ఉన్నారంటే.. అది కచ్చితంగా అమ్మనే. కుటుంబ బంధాల పునాదుల మీదే నిర్మితమైన భారత సమాజంలో తల్లి పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మాటల్లో చెప్పలేని బంధం తల్లీ బిడ్డలది. తల్లే బిడ్డకు మొదటి గురువు.  బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు. వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు. అమ్మే బ్రహ్మను సృష్టించింది. అమ్మ లేనిదే బ్రహ్మ లేడు అన్న‌ది వాస్త‌వం. 

 

ఇక అమ్మ మ‌న‌కు ఒక ఫ్రెండ్, ఫిలసఫర్, గైడ్ అన‌డంలో సందేహం లేదు. అలాంటి అమ్మ కోసం ప్రతీ ఏటా 'మదర్స్ డే' నిర్వహిస్తున్నారు. మే రెండో ఆదివారం రోజున జరుపుకొంటారు. అంటే నేడే మ‌ద‌ర్స్ డే.  ఇక ఎంత స్టార్ డమ్ వచ్చినా, పుట్టుకతోటే వారు స్టార్స్ కాదు కదా.. ఎంతటి సినీ ప్రముఖులైనా తొలిసారి ప్రపంచాన్ని చూసేది అమ్మ కళ్లతోనే. అలాగే తొలి అడుగు వేసేది ఆమె వేలు పట్టుకొనే. అయితే కెరటం సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ర‌కుల్ గ‌తంలో వాళ్ల అమ్మ‌గారి గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. ``నాకు మూడేళ్ల వయసప్పుడే అమ్మ నన్ను భవిష్యత్తులో హీరోయిన్‌గా చూడాలనుకుంది. 

 

అందుకే ఆ ఏజ్‌లోనే నన్ను అందంగా తయారు చేసి టీవీ ప్రకటనల్లోనూ నటింపజేసింది. నాన్న కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్నప్పుడు మేం చాలా భయపడ్డాం. అమ్మ మాత్రం ఆయన బాధ్యతల గురించి వివరించి ధైర్యం చెప్పేది. ఆరోజుల్లో అమ్మ అలా ఎలా ఉండగలిగిందో ఆలోచిస్తే ఇప్పటికీ ఆశ్చర్యమేస్తుంది. క్లాస్‌ ఫస్ట్‌ రాకపోయినా ఫర్వాలేదు కానీ అన్నింట్లోనూ కొంత ప్రావీణ్యం ఉండాలనేది. తన వల్లే స్విమ్మింగ్‌, రైఫిల్‌ షూటింగ్‌, కరాటే లాంటిలి నేను నేర్చుకున్నా. కాలేజీకి వచ్చాక అమ్మ నన్ను మోడలింగ్‌పైపు తేకపోయుంటే నేను హీరోయిన్‌ అయ్యుండేదాన్ని కాదు అని అమ్మ గురించి ఎంతో చ‌క్క‌గా ర‌కుల్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: