విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ చాలా గొప్పది. ఆయన్ని పూర్తిగా ఓన్ చేసుకుంటారు. వెంకీ సినిమాలు రెండు దశాబ్దాల  క్రితం  తీసినవి టీవీల్లో ఇపుడు వచ్చినా కూడా మంచి ఫ్రెష్ గా ఉంటాయి. వాటి టీయార్పీ రేటింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

 

అటువంటి వెంకటేష్ ఇంకా నాటౌట్ అంటూ వెండి తెరను అలరిస్తున్నాడు. అయితే వెంకీ చూపు ఇపుడు వెబ్ సిరీస్ మీద పడిందని అంటున్నారు. లాక్ డౌన్, కరోనా వంటివి పెద్ద హీరోల ఆలోచనలు మారుస్తున్నాయని చెబుతున్నారు. దాంతో ఇపుడు స్టార్ హీరో వెంకటేష్ సైతం వెబ్ సిరీస్ వైపుగా ఆలోచనలు చేస్తున్నారుట.

 

ఇది మంచి పరిణామమేనని అంటున్నారు. ఎందుకంటే వెబ్ సిరీఎస్ కి మంచి ఆదరణ ఉంది. ఏకంగా  ఇంటిళ్ళిపాదీ ఒకే చోట ఉండి చూసేస్తున్నారు. ఇక లాక్ డౌన్ ఎత్తేసినా కూడా సినిమాల పరిస్థితి ఏమంత మెరుగ్గా ఉంటుందని ఎవరూ అనుకోవడం లేదు. ప్రజలు కరోనా భయం నుంచి బయటపడి సినిమాలు మళ్ళీ చూడాలంటే దానికి చాలా ఎక్కువ సమయమే పట్టవచ్చు అంటున్నారు.

 

ఈ లోగా జనాల ఆలోచనల్లో మార్పులు కనుక వస్తే పూర్తిగా పెద్ద తెర కనుమరుగు అయినా ఆశ్చర్యం లేదు. ఇంకో వైపు అన్నాళ్ళ పాటు సినిమా హాళ్ళను మెయింటైన్ చేయడం కూడా కష్టమే. ఈ నేపధ్యంలో సినిమాను నమ్ముకున్న వారంతా ఓటీటీ ఫ్లాట్ ఫారానికి జై కొడుతున్నారు.

 

విక్టరీ వెంకటేష్ ఈ విషయంలో కాస్త ముందు ఉన్నట్లుగా ఉన్నాడు, సురేష్ బాబు ఇప్పటికే ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారుట. అంటే తొందరలోనే వెంకీ వెబ్ సిరీస్ లో కనిపించే అవకాశాలు ఉంటాయన్న‌ మాట.

 

మరో వైపు చిరంజీవి కూడ వెబ్ సిరీస్ వైపు చూపు సారించారని, అల్లు అరవింద్ దీని వెనక ఉన్నారని అంటున్నారు. అంటే సీనియర్లు మెల్లగా ఈ బాటన పడితే జూనియర్లు కూడా అనుసరించడం ఖాయం. రానున్న రోజులు అన్నీ ఓటీటీవేనని రుజువు చేస్తున్నాయి ఈ పరిణామాలు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: