అమ్మ ప్రేమ‌కు అంతమ‌నేదే లేద‌ని చెప్పాలి. అమ్మ అనే మాటలో ఉండే కమ్మదనం ఏంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అమ్మ ఒడే బిడ్డ‌కు తొలి బడి. ఈ లోకంలోకి వచ్చిన ప్రతి జీవి చూసేది ముందుగా అమ్మనే. మనల్ని ప్రేమించి కంటికి రెప్ప‌లా కాపాడుకునేది క‌న్న‌త‌ల్లే. ఒడి నుంచి బడి వరకు మ‌న‌ల్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అమ్మ. పాత్ర అనైహ్యం. ఆ మాతృమూర్తి ఔనత్యాన్నిగుర్తు చేసుకొనే రోజు మదర్స్ డే(మే 9). ఈ సృష్టికి మూలం ఆ భగవంతుడు అవునో కాదు తెలియదు కాని, మానవ సృష్టికి మూలం మాత్రం అమ్మే అన్న విష‌యం ప్ర‌తి ఒక్క‌రికి తెలిసిందే. మనల్ని ఓ కొత్త ప్రపంచానికి పరిచయం చేసే ఆ మాతృ మూర్తికి మనసారా వందనాలు తెలియజేయటం మనందరి కర్తవ్యం.

 

ఇక సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ కూడా అమ్మ ప్రేమ‌కి ఫిదా అవ్వ‌ని వారు ఎవ్వ‌రూ ఉండ‌రు. ఇక మెగా ఫ్యామిలీలో ముగ్గురు అన్న‌ద‌మ్ముల‌కి వాళ్ళ త‌ల్లి అంజ‌నా దేవి అంటే చాలా ఇష్టం. ఎంతో అమిత‌మైన ప్రేమ క‌లిగి ఉంటారు. చిరంజీవి అయితే ఇప్ప‌టికీ ఆమె త‌ల్లితో ఒక చిన్న పిల్లాడిలా గారం చేస్తూ ఎంతో ప్రేమ‌గా చూసుకుంటారు. ఇటీవ‌లె లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటిప‌ట్టునే ఉంటున్న చిరు త‌న త‌ల్లికోసం తానే స్వ‌యంగా పెస‌ర‌ట్టు వేసి మ‌రీ ఆమెకు ఎంతో ప్రేమ‌గా తినిపించారు. ఆమె ప‌క్క‌నే కూర్చుని ఆమెకు విసినిక‌ర్ర‌తో విసురుతూ త‌ల్లి పై త‌న‌కున్న ప్రేమ‌ను చూపించారు. ఇక నాగ‌బాబు విష‌యానికి వ‌స్తే త‌న త‌ల్లితో ఇప్ప‌టికీ ఎంతో స‌ర‌దాగా మాట్లాడుతుంటారు. ఆమెతో జోకులు వేయ‌డం అలాగే వ‌రుణ్‌తేజ్‌, నిహారిక‌లు కూడా వాళ్ళ నాయ‌న‌మ్మ‌తో మంచి అనుబంధం ఉంద‌ని చెప్పాలి.

 

ఇక చివ‌రి కొడుకు ముద్దుల కుమారు ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అమ్మ అంజనా దేవిపై ఉన్న ప్రేమను ఎన్నో సందర్భాల్లో బయట పెట్టారు. ఆయనకు తొలి దైవం అమ్మ‌నే అని ఆయ‌న ఎప్పుడూ చెబుతుంటారు. అలాగే `ఒడిలో పాపై ఒదిగా నేనే` అన్న‌పాట‌ను త‌న త‌ల్లి కోసం ఒక‌సారి ప్ర‌త్యేకంగా కంపోజ్ చేయించి ఆమెకు మ‌ద‌ర్స్ డే రోజున గిఫ్ట్‌గా కూడా త‌న‌కు డెడికేట్ చేశారు.  ఇక అంజ‌నాదేవిగారికి కేవ‌లం త‌న పిల్ల‌ల‌తోనే కాకుండా వారి పిల్ల‌లు అయిన అంటే మ‌న‌వ‌ళ్ళు, మ‌న‌వ‌రాళ్ళ‌తో కూడా చాలా మంచి అనుబంధ‌మే ఉంది. ఆమె అంద‌రితోనూ ఎంతో ప్రేమ‌గా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: