మ‌హేష్‌బాబు అనగానే సూప‌ర్‌స్టార్ కృష్ణ రూపాన్ని, న‌ట‌వార‌స‌త్వాన్ని పునికిపుచ్చుకున్న రాజ‌కుమారుడిలా క‌నిపిస్తాడు. ఇక కృష్ణ మొద‌టి భార్య ఇంద్రాదేవి మ‌హేష్‌బాబు త‌ల్లి. కృష్ణ త‌న మేన‌మామ కూతురు మ‌ర‌ద‌లినే వివాహం చేసుకున్నారు. ఆ త‌ర్వాత విజ‌య‌నిర్మ‌ల‌ను రెండ‌వ వివాహం చేసుకున్నారు. కృష్ణగారి మాట‌ల‌ను గౌర‌వించిన మ‌హోన్న‌త‌మైన మ‌నిషి. ఇక ఇంద్రాదేవిగారు మీడియా కంట ప‌డ‌డం చాలా త‌క్కువ సినీ ఫంక్ష‌న్ల‌కు అస్స‌లు రారు. కృష్ణ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టేస‌రికే ఇంద్రాదేవితో వివాహం జ‌రిగింది. ఇక కృష్ణ ఇందిర‌ల‌కు ఇద్ద‌రు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. 

 

విజ‌య‌నిర్మ‌ల‌తో కృష్ణ‌కు వివాహం జ‌రిగిన‌ప్ప‌టికీ ఇంద్ర‌దేవి కృష్ణ‌తో క‌లిసి పిల్ల‌ల‌ను క‌న్నారు. ఇక విజ‌య‌నిర్మ‌ల‌, ఇంద్రాదేవి కూడా బాగానే ఉండేవారు. ఇక ఇంద్రాదేవి మొద‌టి కుమారుడు ర‌మేష్ ఇటు హీరోగా అటు ప్రొడ్యూస‌ర్‌గా  పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదిస్తే...మ‌హేష్‌బాబు సూప‌ర్‌స్టార్ హీరోగా మంచి ప్ర‌ఖ్యాత‌లు సంపాదించారు. ఇక మ‌హేష్‌బాబుకి వాళ్ళ అమ్మ ఇంద్రాదేవి అంటే చాలా ఇష్టం. ఇక మ‌హేష్ కూతురు సితార కూడా సేమ్ ఇంద్రాదేవి పోలిక‌ల‌ను క‌లిగి ఉంటుంది. ఇంద్ర‌దేవి అంటే మ‌హేష్‌కి ప్రాణం. ఇప్ప‌టికీ చిన్న‌పిల్లాడిలా వాళ్ళ అమ్మ‌ను అస‌లు వ‌దిలిపెట్ట‌డు ఆయ‌న ఎంతో ప్రేమ‌గా వాళ్ళ అమ్మ‌గారి ద‌గ్గ‌ర చిన్న పిల్లాడిలా గారాలు పోతూ ఉంటాడు మ‌హేష్‌. 

 

ఇక మ‌హేష్ ఇంద్రాదేవితో ఎంత ప్రేమ‌గా ఉండేవాడో విజ‌య‌నిర్మ‌ల‌గారిని కూడా అంతే అభిమానించేవాడు. ఆమెను కూడా ఉన్నంత‌వ‌ర‌కూ ఎంతో గౌర‌వంగా చూసేవారు మ‌హేష్‌. అలాగే విజ‌య‌నిర్మ‌ల‌కి కూడా మ‌హేష్ అంటే ఎంతో అభిమానంతో ఉండేవారు. ఆయ‌న పిల్ల‌ల‌ను కూడా చాలా ప్రేమ‌గా ద‌గ్గ‌ర‌కు తీసుకుని చూసేవారు విజ‌య‌నిర్మ‌ల‌. అన్ని విధాలుగా సర్దుకుపోయే మనస్తత్వం ఆడవాళ్ళకే ఎక్కువ‌గా ఉంటుంది. అలాంటి మంచి మ‌న‌స్త‌త్వం క‌లిగిన వ్య‌క్తే ఇందిరాదేవి. ఒక వేళ మ‌హేష్‌బాబు ఏద‌న్నా సినిమా ఫంక్ష‌న్ల‌కు ఇందిరాదేవి క‌నుక వస్తే మ‌హేషే ద‌గ్గ‌రుండి మ‌రీ ఆమె చేయి ప‌ట్టుకుని చాలా జాగ్ర‌త్త‌గా తీసుకువ‌స్తారు. ఆమెను ఎంతో జాగ్ర‌త్త‌గా ఆప్యాయంగా చూసుకుంటారు. అలాగే మ‌హేష్‌కి చిన్న‌ప్ప‌టి నుంచి కూడా వాళ్ళ అమ్మ‌మ్మ అంటే బాగా ఇష్ట‌మ‌ట‌. ఇంద్ర‌దేవి త‌ల్లి మ‌హేష్‌బాబు అమ్మ‌మ్మ ద‌గ్గ‌రే ఎక్కువ‌గా పెరిగాడ‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: