ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో  విజయ్ దేవరకొండ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అన్న  విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ఎంతో మంది సీనియర్ హీరోలు స్టార్ హీరోలు యువ హీరోలు ఉన్నప్పటికీ విజయ్ కి  ఉన్న ఇమేజ్ మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా విజయ్ సినిమాలే కాదు విజయ్ అట్టిట్యూడ్  కూడా యూత్ ని ఆకర్షించే విధంగా ఉంటుంది అయితే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకు పరిచయమై వ్యక్తి ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా ఎదిగడానికి తన తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతగానో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఒక సమయంలో విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. 

 

 

 ముఖ్యంగా తన తల్లి ప్రోత్సాహం ఎంతో ఉందని... తనకు ఎక్కడా కష్టం తెలియకుండా పెంచిన తల్లి తన కెరియర్ లో  బాగా ఎదగాలని ఎంతో ప్రోత్సహించింది అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. ఎలాంటి కష్టాల్లో  అయిన వెన్నుతట్టి తనను ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ ధైర్యం చెప్పేదని విజయ్ దేవరకొండ తెలిపాడు. అయితే విజయ్ దేవరకొండ ఎప్పుడూ తన తల్లి గురించి అడిగినా ఎంతో గొప్పగా చెబుతూ ఉంటాడు. ఇక ఎప్పుడైనా తన తల్లిని స్టేజ్ మీద కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా తల్లి మాధవిని  దగ్గరకు తీసుకుంటాడు విజయ్ దేవరకొండ. 

 

 

 మొన్నటికి మొన్న తన తల్లితో కలిసి ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో చదరంగం ఆడుతూ ఎంతో ఆప్యాయంగా గడిపాడు. ఇక విజయ్ దేవరకొండ తన తల్లితో ఎంతో ఆప్యాయంగా ఉండటం  చూసిన అభిమానులు కూడా ఎంతగానో మురిసిపోయారూ . విజయ్ దేవరకొండ తల్లి మాధవి తన కొడుకు విజయాన్ని తన విజయంగా మలుచుకుని ఎన్నో ఏళ్ల పాటు తన కొడుకుని హీరోని చేసేందుకు ఎంతగానో పరితపించింది . ప్రస్తుతం విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా ఎదిగి  తల్లి కోరికలను నెరవేర్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: