సృష్టికి మూలం అమ్మ... త్యాగానికి ప్రతిరూపం అమ్మ... మమతానురాగాల రూపం అమ్మ. నవమాసాలు మోసి, పురుటి నొప్పులు భరించి అమ్మ మనకు జన్మనిస్తుంది. పుట్టినప్పటి నుంచి ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపుడుకుంటుంది. అమ్మ ప్రేమ ఎప్పటికీ చెదరని మధురానుభవం. మన ఆలనాపాలనా చూసి పెంచి పెద్ద చేసే అమ్మకు ఎంత చేసినా తక్కువే. అమ్మ ప్రేమ ప్రపంచాన్ని మరిపిస్తుంది. ఆ పేరుకు అంతటి మహత్యం ఉంది. 


 
మనకు చిన్న దెబ్బ తగిలినా నోటి నుంచి అమ్మ అని వెంటనే వస్తుంది. మన జీవితంలో అమ్మ స్థానం అంత గొప్పది. పిల్లలు విజయాలు సాధిస్తే తల్లి పడే ఆనందం అంతా ఇంతా కాదు. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమ ఎవరికైతే దక్కుతుందో వారు అత్యంత కోటీశ్వరులు. ప్రపంచంలో మనం అత్యంత అపురూపంగా చూసుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆ వ్యక్తి అమ్మ మాత్రమే. 


 
మమకారానికి నిలువెత్తు నిదర్శనమైన అమ్మకు ఎల్లప్పూడూ పిల్లల ధ్యాసే. దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడని పెద్దలు చెబుతూ ఉంటారు. దేవతలకు కూడా దక్కని అదృష్టం అమ్మ రూపంలో మనుషులకు దక్కింది. అమ్మ ప్రేమ ఎప్పటికీ మారదు. మన కోసం అమ్మ ప్రతిరోజూ ఎన్నో త్యాగాలను చేస్తుంది. మన సంతోషంలోనే తన సంతోషాన్ని వెతుక్కుంటుంది. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. 


 
ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారం రోజున మదర్స్ డే ను జరుపుకుంటాం. 1914 సంవత్సరం నుంచి మదర్స్ డేను అధికారికంగా నిర్వహిస్తున్నారు. 17వ శతాబ్దంలో బ్రిటన్ తల్లులకు గౌరవంగా ‘మదరింగ్‌ సండే’ పేరిట ఉత్సవాన్ని జరిపేది. జూలియవర్డ్ అనే మహిళ 1872 లో మదర్స్ డే జరపాలని ప్రతిపాదన చేయగా మేరీ అనే మహిళ కూడా మదర్స్ డే కోసం ఎంతో కృషి చేసింది. మేరీ 1905 మే రెండో ఆదివారం రోజు మృతి చెందడంతో ఆమె కుమార్తె మిస్‌ జెర్విస్ మదర్స్ డే కోసం విసృతంగా ప్రచారం చేసి ఆ ప్రయత్నంలో సక్సెస్ అయింది. 1914 నుంచి మదర్స్ డే ను అధికారికంగా నిర్వహించడం ప్రారంభమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: