టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ నిన్న తన 30వ జన్మదినాన్ని తన కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు. కొద్దిరోజులుగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. దానితో మన దేశాన్ని కూడా కొన్నాళ్లుగా లాక్ డౌన్ చేయడంతో అనేక రంగాలు మూతబడడం, అలానే ఎక్కడి ప్రజలు అక్కడే ఇళ్లలో ఉండిపోవడంతో ఎందరో దిగువ వర్గాల వారు ఆకలితో అలమటించే పరిస్థితులు తలెత్తాయి. వారిని ఆడుకోవడానికి ప్రభుత్వంతో పాటు ఎందరో ప్రముఖులు సైతం ముందుకు రాగా, మన సినిమా ఇండస్ట్రీ నుండి కూడా కొందరు ముందుకు వచ్చి తమకు వీలైనంత సాయాన్ని అందించారు. 

 

కాగా ముందుగా రూ.1.30 కోట్ల విరాళాన్ని కరోనా బాధితులకు ప్రకటించిన విజయ్, ఆపై కొందరు టీమ్ సభ్యులతో కలిసి మిడిల్ క్లాస్ ఫండ్ పేరుతో ఒక ఫౌండేషన్ ని ఏర్పాటు చేసి, కొంత బయటి వారి నుండి విరాళాలు సేకరిస్తూ అన్నార్తుల ఆకలిని తీరుస్తూ తన గొప్ప మనసుని చాటుకుంటున్నాడు. ముందుగా పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్, ఆపై అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల సక్సెస్ లతో హీరోగా స్టార్ స్టేటస్ ని సంపాదించడం జరిగింది. ఇక ప్రస్తుతం డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమాని చేస్తున్న విజయ్, నేడు పుట్టినరోజు జరుపుకోవడంతో అనేకమంది అభిమానులతో పాటు పలువురు సినిమా ప్రముఖులు సైతం ఆయనకు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియచేసారు. 

 

ఇక అసలు విషయం ఏమిటంటే, చాలా మంది హీరోయిన్లు కూడా విజయ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడం ఒకింత చర్చ మారింది. చూడడానికి ఎంతో అందంగా ఉండడంతో పాటు, తన సహజ నటనతో అమ్మాయిల మనసులు దోచుకున్న విజయ్, హీరోయిన్ల లో కూడా మంచి పేరుని దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు నిజానికి ఈ రేంజ్ లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందని, ఇక ప్రస్తుతం ఆ రేంజ్ లో విజయ్ కూడా లేడీ ఫ్యాన్స్ ని సంపాదించి దూసుకెళ్తున్నాడని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!!  

మరింత సమాచారం తెలుసుకోండి: