పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాస్తవానికి కొన్నేళ్ల క్రితం దాదాపుగా వరుసగా చాలా ఫ్లాప్స్ ని చవిచూసి, కెరీర్ పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే ఆ ఫ్లాప్స్ వలన ఆయన ఇమేజ్ ఏ మాత్రం తగ్గినప్పటికీ, ఆయన ఫ్యాన్స్ కు మాత్రం విపరీతమైన నిరాశను కలిగించాయి. ఆ విధంగా వరుసగా తమ హీరో నిరుత్సాహ పరుస్తుండడంతో, ఎప్పుడు ఆయన హిట్ కొడతారో అని అభిమానులు ఎంతగానో ఆశగా ఎదురు చూడసాగారు. సరిగ్గా అదే సమయంలో అప్పట్లో బాలీవుడ్ లో రిలీజ్ అయిన దబాంగ్ సినిమాని తెలుగులో గబ్బర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్, పోలీస్ డ్రెస్ వేసుకుని చేతిలో బెల్ట్ పట్టుకుని ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. 

 

అంతకముందు తనతో తీన్ మార్ సినిమాని నిర్మించిన బండ్ల గణేష్ నిర్మాతగా యువ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కనున్నట్లు పవన్ ప్రకటించడం జరిగింది. అయితే ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆయన ఫ్యాన్స్ లో సినిమాపై బాగా ఆశలు రేగాయి. అనుకున్న విధంగా సినిమాని ఎంతో గొప్పగా తెరకెక్కించిన హరీష్, రిలీజ్ తరువాత పవన్ ఫ్యాన్స్ ఆనందాన్ని చూసి ఎంతో ముగ్ధుడయ్యారు. ఇక సినిమా గురించి పలువురు పవన్ ఫ్యాన్స్ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ల నుండి పవన్ నుండి సరైన హిట్ కోసం చూస్తున్నాం అని, తాము ఎన్నో ఏళ్లుగా చూస్తున్న ఎదురు చూపులు, ఆకలిని ఈ ఒక్క గబ్బర్ సింగ్ సినిమాతో దర్శకుడు హరీష్ శంకర్ తీర్చేసారని చెప్పడం జరిగింది. అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకున్న ఈ సినిమా రిలీజ్ అయిన దాదాపుగా చాలా ఏరియాల్లో గత రికార్డ్స్ ని బద్దలుకొట్టి సరికొత్త రికార్డులను సృష్టించడం జరిగింది. 

 

గబ్బర్ సింగ్ పాత్రలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్, దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆకట్టుకునే విజువల్స్, మాస్ యాక్షన్ సీన్స్, ముఖ్యంగా దర్శకడు హరీష్ శంకర్ అద్భుత దర్శకత్వ ప్రతిభతో పాటు ఆయన రాసుకున్న డైలాగ్స్ సినిమాలో ఎంతో గొప్పగా పేలాయి. పవన్ నోటి వెంట పలికే ఆ డైలాగ్స్ కు అప్పట్లో థియేటర్స్ మారుమ్రోగాయి అనే చెప్పాలి. ఇకపోతే గబ్బర్ సింగ్ రిలీజ్ అయి రేపటితో సక్సెస్ఫుల్ గా ఎనిమిదేళ్లు పూర్తి చేసుకోబోతుండడంతో పవన్ ఫ్యాన్స్ దానిని సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రెండ్ గా క్రియేట్ చేసి పరిగెత్తిస్తున్నారు. సినిమా వచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా, దానికున్న పవర్ మాత్రం ఇంకా తగ్గలేదని పలువురు పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: