మన చిన్నప్పటి నుండి కాదు కాదు.. మనం పుట్టినప్పటి నుండి మన కోసం ఎవరైనా కష్టపడతారు అంటే అది అమ్మే. మనం కడుపులో ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డ కోసం కలలు కంటుంది.. బిడ్డ భూమిపై పడ్డాక.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ పెంచుతూ.. ప్రేమిస్తూ ఎంతో ఆనందంగా చూసుకుంటుంది.. 

 

ఇంకా అలాంటి అమ్మ మన కోసం ఎంతో కష్టపడుతుంది.. చిన్నప్పటి నుండి ఏది మంచి ఏది చేడు అనేది చెప్తూ పెరుగుతుంది.. మనం ఆనందంగా ఉంటే తను ఆనందంగా.. మనం ఏడిస్తే తను ఏడుస్తూ.. మనకు ఏదైనా కష్టం వస్తే నేను ఉన్న అంటూ మనకు ఎప్పుడు తోడుగా ఉంటుంది మన అమ్మ. 

 

ఇంకా అలాంటి అమ్మ చిన్నప్పటి నుండి మనకు ఎన్నో పాఠాలు.. గుణ పాఠాలు నేర్పిన సంగతి తెలిసిందే. అసలు మన అమ్మ మనకు  చిన్నప్పటి నుండి చెప్పిన పాఠాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 

1. ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోకూడదు. 

 

2. డబ్బు ఆదా చెయ్యాలి. 

 

3. అన్నం పరబ్రహ్మ స్వరూపం... వేస్ట్ చెయ్యకూడదు. 

 

4. ప్రేమను ఎవరికైనా ఇవ్వగలం.. అలాగే తిరిగి ఆ ప్రేమను పొందగలం.. అదే ఆ ప్రేమ గొప్పతనం. 

 

5. సహనంతో ఉండాలి. 

 

6. స్వార్థంగా ఉండకూడదు.. 

 

7. జీవితంలో ఏదైనా సరే.. అనుకున్నాం అంటే సాధించాలి.. కష్టం వచ్చింది అని మధ్యలో వదిలేయకూడదు. 

 

8. మన జీవితంలో పిల్లలు అయినా.. పెద్దలు అయినా గౌరవం ఇవ్వాలి.. తీసుకోవాలి. 

 

9. బాధ్యతలు స్వీకరించి పూర్తి చెయ్యాలి.. అప్పుడే మన చుట్టూ ఉన్నవారు ఆనందంగా ఉంటారు.. 

 

ఈ మాటలు మన అమ్మ తరచూ చెప్తూ ఉంటుంది.. ఇలా ఉండు నాన్న.. అలా ఉండు నాన్న అని.

మరింత సమాచారం తెలుసుకోండి: