ఈ సంవత్సరం సంక్రాంతి రేస్ కు వచ్చిన ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు రెండు విజయవంతం కావడమే కాకుండా ఈరెండు సినిమాలకు సుమారు 250 కోట్ల నెట్ కలక్షన్స్ రావడంతో ఈసంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీకి సువర్ణయోగం పట్టింది అంటూ నిర్మాతలు పండగ చేస్తుకున్నారు. దీనితో ఈసమ్మర్ సీజన్ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి బాగా కలిసి వస్తుందని సమ్మర్ రేసుకు రాబోయే సినిమాలు అన్నింటికీ భారీ అంచనాలు సమ్మర్ సీజన్ లో ఉండటంతో కనీసం ఈసమ్మర్ సీజన్ లో 500 కోట్లకు పైగా ఈ కలక్షన్స్ వస్తాయని సినిమాల నిర్మాతలు బయ్యర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 


అయితే ఆ కలలను కరోనా ఘోరంగా దెబ్బ తీయడంతో వేసవి అంతా సినిమాలు లేక మూతపడటంతో తెలుగు సినిమా పరిశ్రమకు అత్యంత భారీ నష్టాలు వచ్చాయి. ఈ నష్టం భర్తీ కావడానికి చాలా కాలం పడుతుంది. దీనితో సినీ నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు అందరూ నష్టపోవడంతో తగిన చర్యలు తీసుకుంటే తప్ప మళ్ళీ ఇండస్ట్రీ మునుపటి స్థితికి వెళ్లడం అసాధ్యం.


ఈ కరోనా లాక్ డౌన్ సమయంలోనే అనేకమంది నిర్మాతలు ఒకరికి ఒకరు తమ కష్టాలను షేర్ చేసుకుంటూ సినిమా నిర్మాణ వ్యయం భారీగా తగ్గాలి అని 100 కోట్లతో తీసే సినిమాని 70 కోట్ల లోపే పూర్తి చేయాలి అన్ననిర్ణయం తీసుకుని సినిమా ప్రాజెక్ట్ నిర్మాణంలో అత్యధిక భాగం హీరోల పారితోషికమే ఉంటుంది కాబట్టి హీరోలను ఈవిషయం పై సహకరించమని కొందరు టాప్ మిడిల్ రేంజ్ హీరోలతో కొందరు ప్రముఖ ఇప్పటికే ఈ విషయమై రాయబారాలు చేసినట్లు టాక్. అయితే నిర్మాతల రాయబారానికి హీరోలు మౌనంగా విని ఎటువంటి స్పందన తెలపలేదని తెలుస్తోంది. 


అయితే ఒకరిద్దరు టెక్నీషియన్లు మాత్రం తమ పారితోషికం తగ్గించుకుంటామని పరిశ్రమని నిలబెట్టుకోవడానికి అది తప్పదని ఓపెన్ గానే స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితులలో లాక్ డౌన్ ముగిసిన తరువాత తెలుగు సినిమా ప్రముఖులంతా కలిసి సర్వసభ్య సమావేశం నిర్వహించి ఈసమావేశానికి హీరోలు అందర్నీ పిలిచే ఆలోచనలలో ఉన్నారట. కనీసం ఆ సమావేశం సమయానికి అయినా హీరోలు తమ మౌనం వీడతారని చాలామంది నిర్మాతలు  భావిస్తున్నట్లు టాక్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: