అమ్మ పిల్లల కోసం ఎన్ని త్యాగాలు చేస్తుంది.. ఆ త్యాగాల గురించి చెప్పలేం.. పుట్టినప్పటి నుండి పెరిగి ప్రయోజకుడు అయ్యే వరకు కూడా తల్లి ఎన్నో త్యాగాలు చేస్తుంది.. చెప్పాలి అంటే మన జీవితం కోసం తన కలలు అన్ని పక్కన పెట్టేస్తుంది.. పిల్లలు ఉంటే చాలు నా జీవితానికి ఏం తక్కువ అని ప్రతీది పిల్లల కోసమే చేస్తుంది. అయితే తల్లి పిల్లల కోసం జీవితంలో ఏం ఏం త్యాగాలు చేస్తుందో ఇక్కడ చదివి తెలుసుకుందాం... 

 

పిల్లలు పుట్టాక.. తన సమయం అంత వారికోసమే అవుతుంది.. పిల్లల కోసం తాను తనకోసం సృష్టించుకున్న కాస్త సమయం కూడా ఆ పిల్లల కోసమే కేటాయిస్తుంది. 

 

తన ఆనందాన్ని కూడా పిల్లల చిరునవ్వులోనే చూసుకొని ఆనంద పడుతుంది.... ఇంకా మనకు ఏదైనా సమస్య వస్తే తాను కుంగిపోతుంది.. 

 

ఒక ఆడపిల్లగా ఉన్నప్పుడు.. భార్యగా ఉన్నప్పుడు డబ్బు ఎంత అంటే అంత ఖర్చు పెడుతుంది. కానీ తల్లి అయ్యింది అంటే వారి పిల్లల చదువుల కోసం.. పిల్లల అవసరాల కోసం డబ్బు దాచిపెడుతుంది తప్ప ఖర్చు పెట్టాదు. 

 

అవును.. పెళ్లి అయ్యాక.. తల్లి తండ్రులను వదిలి భర్తపై ప్రేమ చూపిస్తుంది.. ఇంకా పిల్లలు పుట్టాక.. తల్లితండ్రులు, అత్తమామలు, ఆఖరికి భర్త కంటే కూడా పిల్లలపైనే ప్రేమ ఎక్కువ అవుతుంది. 

 

పిల్లలు పుట్టాక తన స్వేచ్చని కూడా వదిలి పిల్లల కోసమే త్యాగం చేస్తుంది... ఏం చెయ్యాలి అన్న సరే పిల్లల కోసమే ఆలోచిస్తుంది.. 

 

పిల్లల ఆరోగ్యం కోసం ఇంట్లోనే చేసి పెడుతుంది.. రాకపోతే నేర్చుకుంటుంది తప్ప బయట ఆహారం పెట్టదు.. ఇంట్లోనే పిల్లాడికి ఇష్టమైన ఆహారం చేసి పెడుతుంది. 

 

చూశారుగా.. పిల్లల కోసం తాను ఎన్ని త్యాగాలు చేస్తుంది అనేది.. ఏ మహిళా ఎవరి కోసం అన్ని త్యాగాలు చెయ్యలేదు.. కానీ బిడ్డ కోసం త్యాగం చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: