మారుతున్న కాల‌మాన ప‌రిస్థితుల‌కు అనుగుణంగా చిత్ర‌సీమ‌లోనూ భారీ మార్పులు చోటు చేసుకుంటుండ‌టం మ‌నం చూస్తునే ఉన్నాం. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం మానేస్తున్న రోజులివి. ఇక లాక్‌డౌన్‌తోనైతే దాదాపు సినిమా మార్కెట్ తుడిచి పెట్టుకుపోయింది. ఈనేప‌థ్యంలోనే నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ వంటి వాటికి ఎంతో ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇదిలా ఉండ‌గా రెండు సంవ‌త్స‌రాలుగా వెబ్ సిరిస్‌ల సంఖ్య కూడా సినిమాల‌కు దీటుగా ఉంటుండ‌టం గ‌మ‌నార్హం. ఇందులో ఇన్నాళ్లు అడ‌పాద‌డ‌పా పెద్ద స్టార్లు న‌టించినా పెద్ద‌గా క‌న్సంట్రేష‌న్ చేయ‌లేద‌నే చెప్పాలి. అయితే ఇప్పుడు ప‌రిస్థితి మారింది.

 

 పెద్ద‌స్టార్లు కూడా మెల్ల‌గా వెబ్‌సిరిస్‌ల వైపు అడుగులు వేస్తున్నారు. ఆ కోవ‌లోనే కోలివుడ్ హీరో ధ‌నుష్ ఓ అగ్రిమెంట్‌కు సైన్ కూడా చేసేశారు. దర్శకుడు వెట్రిమారన్‌, నటుడు ధనుష్‌ కలయికలో ఓ వెబ్ సిరిస్ రానుంది. వాస్త‌వానికి వీరిద్ద‌రి హిట్ కాంబినేష‌న్ సినిమా అంటే కోలీవుడ్‌లో భారీ అంచనాలుంటాయి. 2018లో ధనుష్‌, ఆండ్రియా, ఐశ్వర్యారాజేష్‌, అమీర్‌, సముద్రఖని  తార‌గ‌ణం న‌టించిన  వడచెన్నై చిత్రం మంచి వ‌సూళ్ల‌ను సాధించింది. ధ‌నుష్ కెరీర్‌లో భారీ విజ‌యం సాధించిన చిత్రంగా నిలిచిపోయింది. ఉత్తర చెన్నైలో జరిగే నేరాల నేపథ్యంలో ఈ చిత్రంలో క‌థ సాగుతుంది.

 

ఇప్పుడు దీనికి సీక్వెల్‌ను తెర‌కెక్కించాల‌ని  నిర్ణయానికి వ‌చ్చిన‌ట్లు స్వ‌యంగా ద‌ర్శ‌కుడు వెట్రిమారన్ స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే ఇది వెబ్‌సిరిస్‌గా ఉంటుంద‌ని  పేర్కొన్నారు. ఇలా పెద్ద తారాగణంతో వస్తున్న తొలి వెబ్‌ సిరీస్‌ ఇదే కావ‌డం ఇప్పుడు చిత్రసీమీలో హాట్ టాపిక్‌గా మారింది.  ప్ర‌స్తుతం సూరి హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్నారు వెట్రిమారన్ తెర‌కెక్కిస్తున్నారు. దీని  తర్వాత సూర్య కథానాయకుడిగా ‘వాడివాసల్‌’కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ఈ రెండు పూర్త‌య్యాకే ‘వడచెన్నై 2’ షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: