బాలీవుడ్ సీనియర్ హీరో చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా ద్వారా సినీ పరిశ్రమలో రంగ ప్రవేశం చేసింది. తన తండ్రి నటనా వారసత్వాన్ని అద్భుతంగా కొనసాగిస్తూ కేవలం కొన్ని సంవత్సరాల్లోనే అగ్రతారగా ఎదిగింది. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన ఫైటర్ అనే సినిమాలో నటిస్తోంది. ఆమె అందాల ఆరబోతకు ఎటువంటి నిర్మొహమాటం చూపించదు. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో మాతృ దినోత్సవం ఘనంగా జరుగుతుండగా... ఇందులోని భాగంగానే అనన్య పాండే సోషల్ మీడియాలో తన చిన్ననాటి క్యూట్ వీడియో ని పోస్ట్ చేసి అందరినీ మెప్పిస్తుంది.


ఆ వీడియోలో ఒక వ్యక్తి మూడు-నాలుగేళ్ళ వయసులో ఉన్న అనన్య పాండేని... "ఈ ప్రపంచంలో ఎవరిని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తావు? " అని ప్రశ్నించగా... తాను తనకు తన అమ్మ అంటే చాలా ఇష్టం అంటూ క్యూట్ గా చెబుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. నెటిజనులు ఈ వీడియో కింద కామెంట్స్ చేస్తూ... మేము ఇప్పటివరకు చూసిన వాటిలలో ఈ వీడియో చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని తెగ పొగిడేస్తున్నారు.


అనన్య పాండే తల్లి పేరు భావన పాండే. ఈమె ఒకరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తన కూతురు అనన్య పాండే ని తాను పెళ్లి కాకముందే కన్నానని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 1998 జనవరి నెలలో చంకీ పాండే భావన పాండే పెళ్లి చేసుకోగా... వాళ్ళిద్దరికీ 1997 అక్టోబర్ నెలలోనే అనన్య పాండే పుట్టింది. అనన్య పాండే మొదటిగా యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా లో చేరి తన ఉన్నత చదువులు చదవాలని ఉంది కానీ అనుకోకుండా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యి సినీ పరిశ్రమలోనే ఉండిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: