క‌రోనా కార‌ణంగా సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కూ ప్ర‌తి ఒక్క‌రూ ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఇక లాక్‌డౌన్ పూర్తయ్యే సరికి నేనింకా బెటర్‌ యాక్టర్‌ని అవుతానని అనుకుంటున్నాను”…. అని అంటోంది సమంతా. ప్రస్తుతం లాక్‌డౌన్ సమయంలో సినీ ప్రముఖలందరూ ఇళ్లకే పరిమితమయిన విష‌యం తెలిసిందే. ప్ర‌తి ఒక్క‌రూ కుటుంబ సభ్యులతో సరదాగా స‌మ‌యాన్ని గడుపుతున్నారు. కొందరు ఇంటి పని, వంటి పని చేస్తున్నారు. కొందరు కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పదేళ్ల క్రితం తెలుగు తెరంగేట్రం చేసి మంచి నటిగా నిరూపించుకున్న సమంత ప్రస్తుతం ఆన్‌లైన్ యాక్టింగ్ క్లాస్‌లో జాయిన్ అయిందట. ఆన్‌లైన్‌లో యాక్టింగ్ క్లాసులు వింటోంది .హెలెన్‌ మెరీన్‌ ‘ద క్వీన్‌’ చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఆస్కార్‌ పురస్కారం అందుకున్నారు. అమెరికన్‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ ఫ్లాట్‌ఫార్మ్‌ ‘మాస్టర్‌ క్లాస్‌’లో యాక్టింగ్‌ పాఠాలు చెబుతున్నారామె. హెలెన్‌ మెరీన్‌ అంతకు ముందు రెండుసార్లు ఉత్తమ సహాయనటిగా ‘ద మ్యాడ్‌నెస్‌ ఆఫ్‌ కింగ్‌ జార్జ్‌’, ‘గాస్‌ఫోర్డ్‌ పార్క్‌’ చిత్రాలకు… ఆ తర్వాత ఉత్తమ నటిగా ‘ద లాస్ట్‌ స్టేషన్‌’ చిత్రానికి ఆస్కార్స్‌కు నామినేటయ్యారు. ఇప్పుడు లాక్‌డౌన్‌లో ఇంటికి పరిమితమైన సమంత హెలెన్‌ మెరీన్‌ పాఠాలే వింటోంది .


 
‘‘ఇప్పుడు నేను మరింత మంచి నటిగా మారబోతున్నా. జస్ట్‌… కొన్ని రోజులు వెయిట్‌ చేసి చూడండి. మంచి రోజులు ముందున్నాయి’’ అంటోంది స్యామ్‌. “ఈ లాక్‌ డౌన్‌ పూర్తయ్యే సరికి నేనింకా బెటర్‌ యాక్టర్‌ని అవుతానని అనుకుంటున్నాను. ఒకవేళ కాలేదనుకోండి.. అప్పుడు ఈ పోస్ట్‌ని డిలిట్‌ చేస్తాన”ని సమంత అంటోంది. ఆమె నటనకు ఎందరో అభిమానులున్నారు. అయినప్పటికీ… ఇంకా బాగా నటించాలని కష్టపడుతోందంటే.. నటన పై సమంతకు ఎంత ప్రేమ, గౌరవం ఉన్నాయో దీన్ని బ‌ట్టే అర్థమ‌వుతోంది.


 
ప్ర‌స్తుతం స్యామ్ మరో రీమేక్‌లో నటించనుందని సమాచారం. అయితే ఇప్పటి వరకు చేసిన ‘యు టర్న్‌’, ‘ఓ బేబీ’, ‘జాను’ వంటి మూడు రీమేకుల్లో ఒక్క ‘ఓ బేబీ’ తప్ప మిగిలిన రెండూ ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. అయినప్పటికీ సమంత మరోమారు రీమేక్‌తో ప్రయోగం చేద్దామనుకున్నారట. కన్నడలో లో బడ్జెట్‌లో రూపొందిన ‘దియా’ చిత్ర రీమేక్‌ రైట్స్‌ని ఓ పెద్ద నిర్మాత భారీ ఆఫర్‌తో తీసుకున్నట్టు… దాన్ని తెలుగులో సమంతతో చేయాలని అనుకోవడం… ఈ సినిమాని చూసిన సమంత కూడా నటించాలని అనుకోవడం జరిగిపోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: