నటీనటుల పనితీరు,కామెడీ,పాటలు,సినిమాటోగ్రఫీ నటీనటుల పనితీరు,కామెడీ,పాటలు,సినిమాటోగ్రఫీ రెండవ అర్ధ భాగం కాస్త నెమ్మదిస్తుంది,డబ్బింగ్ లో కొన్ని లోపాలున్నాయి

జాన్(ఆర్య) మరియు రెజిన(నయన తార) పెళ్ళితో కథ మొదలవుతుంది, ఇంట్లో పెద్ద వాళ్ళ కోసం పెళ్లి చేసుకున్న వీరిద్దరూ దానికి తగ్గట్టుగానే ఒకే ఇంట్లో ఉంటారు కానీ కలిసి మాత్రం ఉండరు. పేరుకి భార్యభర్తలే కాని ఎప్పుడు ఎడమొహం పెడమొహం లానే ఉంటారు. ఒకానొక సమయంలో వారి గతం గురించి ఇద్దరికీ తెలుస్తుంది. గతంలో రెజిన , సూర్య (జై) ని ప్రేమించి ఉంటుంది. తన కూతురిని ఎంతగానో ప్రేమించే సత్య రాజ్ కూడా రెజిన ప్రేమకు అంగీకరిస్తాడు కాని సూర్య వాళ్ళ నాన్న వీరి పెళ్ళికి ఒప్పుకోడు. అలానే జాన్ , కీర్తన(నజ్రియ)ను ప్రేమించి ఉంటాడు. అనుకోని కారణం మూలాన వీరిరువురు విడిపోవలసి వస్తుంది. ఒకరి గతం ఒకరికి తెలిసాక వీరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ కలుగుతుంది కాని వీరి మధ్య "ఈగో" రావడంతో రెజినా ఆస్ట్రేలియా వెళ్లిపోవాలి అని అనుకుంటుంది. కీర్తన ఏమయ్యింది? జై ఏమయ్యాడు? రెజినా ఆస్ట్రేలియా వెళ్లిపోయిందా ? అనే అంశాలు చిత్రంలో చూడవలసిందే...

ఆర్య ఈ చిత్రంలో చాలా బాగా నటించారు జాన్ పాత్రలో అయన నటన చాలా బాగుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఒక భర్త పాత్రలో మరియు ప్రేమించిన అమ్మాయి వెంటపడే ఒక యువకుడి పాత్రలో అయన చాలా బాగా నటించారు. నయనతార ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ ఆమె నటన ఈ చిత్రానికి చాలా ప్లస్ అయ్యింది అందులోనూ ఫ్లాష్ బ్యాక్ లో ఆమె నటన చాలా బాగుంది. జై కూడా తన పాత్రతో ప్రేక్షకుల మార్కులు కొట్టేసాడు, అన్నింటికీ భయపడే పాత్రలో అయన నటన చాలా ఆకట్టుకుంది. నజ్రీయ తన పాత్రకు కావలసినంత నటన ఇచ్చి తనవంతు మార్కులు తను దక్కించుకుంది. సత్యరాజ్ ఉన్నదీ కాసేపు అయినా పాత్రకు తగ్గ న్యాయం చేసాడు . సంతానం అక్కడక్కడ తనదయిన శైలిలో "పంచ్" లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మిగిలిన నటులందరు ఉన్నంతలో బాగానే నటించారు...

నూతన దర్శకుడు అట్లీ , అద్భుతమయిన ప్రతిభ కనబరచారు నయనతార, ఆర్య మరియు జై లాంటి నటులను ఉపయోగించిన విధానం చాలా బాగుంది. ఇక కథనంలో ఎక్కడా వేగం తగ్గనివ్వలేదు కాని చివరికి వచ్చేసరికి కథనం ఊహాజనితం అయిపోయినా అది చిత్రం మీద ఎటువంటి ఎఫెక్ట్ కనబరచలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఒక్కో ఫ్రేమ్ ను తెరకెక్కించిన తీరు చాలా బాగుంది. జి వి ప్రకాష్ అందించిన సంగీతం బాగుంది నేపధ్య సంగీతం కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ మొదటి అర్ధ భాగంలో అంతంతమాత్రంగా ఉన్నా రెండవ అర్ధ భాగం వచ్చేసరికి కావలసినంత వేగం సమకూరింది. మాటలు అందించిన శ్రీ రామ కృష్ణ గొప్పగా అయితే రాసేయ్యలేదు కాని సన్నివేశానికి తగ్గ సంభాషణలు అందించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ఒక జంట , వారి గతం గురించి తెలుసుకొని ఒకరినొకరు ఎలా అర్ధం చేసుకున్నారు అన్నదే ఈ కథ, చూడడానికి చాలా సింపుల్ గా ఉన్న ఈ కథ నిజంగా చాలా సింపుల్ గ ఉంటుంది కాని ఇలాంటి కథకు కథనం తాయారు చేసుకోవడం అంటే కత్తి మీద సామే ఎందుకంటే ఇలాంటి కథలో న్యాయం చేకూర్చాల్సిన అంశాలు చాలానే ఉంటాయి వాటిన్నింటిని త్రుప్తి పరిచే విధంగా ఈ చిత్రాన్ని సమర్ధవంతంగా తెరకెక్కించారు అట్లీ, మొత్తానికి ఈ యువ దర్శకుడిని అభినందించి తీరాలి, నయనతార నటన ఈ చిత్రానికి ప్రధాన ప్లస్ రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించాక అందంతో కన్నా అభినయంతోనే ఎక్కువగా ఆకట్టుకుంటుంది నయనతార. అలానే ఈ చిత్రంలో చేసిన నటన కూడా చిత్రానికి బాగా సహాయపడింది తరువాత జై నటన కూడా అదే స్థాయిలో ఉండటంతో మొదటి అర్ధ భాగం చాలా బాగా కుదిరింది. రెండవ అర్ధ భాగం కాస్త నెమ్మదించినా కూడా కథనంలో అందం ఎక్కడా తగ్గలేదు... ప్రేమ ఒక్కసారి మాత్రమే పుట్టేది కాదు అనే అంశాన్ని చాలా చక్కగా చూపించారు దర్శకుడు ఈ చిత్రాన్ని చూడొద్దు అని చెప్పడానికి ఎటువంటి కారణం లేదు . ... ఒక ఫీల్ గుడ్ చిత్రం చూడాలనుకునే వారు దగ్గరలో ఈ చిత్ర థియేటర్ కి వెళ్ళిపొండి ...

Atlee Kumar,A.R. Murugadoss,Arya,Nayantara,Nazriya Nazim.రాజ రాణి : ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్

మరింత సమాచారం తెలుసుకోండి: