బుల్లితెరపై తన ప్రస్థానం మొదలు పెట్టిన నటీనటులు తర్వాత వెండి తెరపై మంచి సక్సెస్ సాధిస్తున్నారు.  ఈ మద్య జబర్ధస్త్ లో వచ్చిన వారు ఇప్పుడు టాలీవుడ్ లో మంచి కమెడియన్లు గా సక్సెస్ సాధిస్తున్న విషయం తెలిసిందే.  అయితే తెలుగులో మెయిల్స్ కమెడియన్లే కాదు లేడీ కమెడియన్లు సైతం మంచి సక్సెస్ సాధిస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు గిరిజ, రమాప్రభ ఎంతో మంది కమెడియన్లు నవ్వులు పూయించారు.  ఆ తర్వాత తెలుగు సురేఖ వాణి మంచి లేడీ కమెడియన్ గా పేరు తెచ్చుకుంది.  బుల్లితెరపై మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ లాంటి టీవీ షోలకు సురేఖా వాణి యాంకరింగ్ చేశారు. ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ రావడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు.  సురేఖ వాణి తనదైన కామెడీ పండించండం మంచి పేరు తెచ్చుకున్నారు.

 


సురేష్ తేజ డైరెక్షన్‌లోనే మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ లాంటి టీవీ షోలతో ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. ఇదే సమయంలో ఇద్దరి మద్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకున్నారు. టాలివుడ్‌లో కేరక్టర్ ఆర్టిస్ట్ సుపరిచితమైన నటి సురేఖావాణి, అటు వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా సంచలనాలు సృష్టించింది.  సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సురేఖావాణికి నెటిజన్లలో మంచి క్రేజ్ ఉంది. సురేఖ వాణి కూతురు పేరు సుప్రీత.. ఈ అమ్మడు ఎక్కువగా సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటారు.  గతంలో వీరిద్దరి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియా తెగ హల్ చల్ చేసింది. 

 

తాజాగా స‌క్సెస్‌ఫుల్ న‌టిగా రాణిస్తున్న త‌న స‌క్సెస్‌కు ప్ర‌ధాన కార‌ణాన్ని రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు సురేఖా వాణి. మనసు నిర్మలంగా ఉండాలి.. ప్రశాంతంగా ఉంచుకోవాలి అన్నారు.   స‌మ‌య‌పాల‌నే త‌న విజ‌యానికి కార‌ణ‌మ‌ని సురేఖా వాణి తెలిపారు. ఎక్క‌డికైనా వెళ్లాలంటే ఎన్ని గంట‌ల‌కు వెళ్లాలి? ఎప్పుడు నిద్ర లేవాలి? ఎప్ప‌టికంతా రెడీ కావాలి?  అని ముందుగానే ప్లాన్ చేసుకుని దానికి త‌గిన‌ట్లు టైమ్‌కు మేనేజ్ చేసుకుంటా అన్నారు సురేఖా వాణి. 

మరింత సమాచారం తెలుసుకోండి: