మొన్న బుట్టబొమ్మ సాంగ్ కు స్టెప్పులు వేసి రచ్చ రచ్చ చేసిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ నేడు మరో టిక్ టాక్ వీడియో తో ముందుకొచ్చాడు. టాలీవుడ్ ఆల్ టైం బ్లాక్ బాస్టర్ పోకిరి సినిమాలోని పవర్ ఫుల్ డైలాగ్ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే డైలాగ్ కు డబ్ స్మాష్ చేసిన వార్నర్ ఆ వీడియో ను టిక్ టాక్ తోపాటు ఇతర సామజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. దాంతో ప్రస్తుతం ఆ  వీడియో వైరల్ అవుతుంది.
ఇక ఆ వీడియో కాస్త పోకిరి డైరెక్టర్ పూరి జగన్నాథ్ కంటపడడం తో అయన స్పందించాడు. సూపర్ వార్నర్ ఈ డైలాగ్ నీకు బాగా సూట్ అయ్యింది.  నువ్వు  సూపర్ యాక్టర్వి కూడా.. నా సినిమాలో క్యామియో రోల్ లో చేస్తావని ఆశిస్తున్నాను అని పూరి ట్వీట్ చేశాడు. 
 
ఇక లాక్ డౌన్ వల్ల క్రికెట్ ఆడేందుకు వీలులేకపోవడంతో ఇంట్లో నే వుంటూ  సోషల్ మీడియా లో ఎక్కువ సమయం గడుపుతున్నాడు వార్నర్.  

మరింత సమాచారం తెలుసుకోండి: