ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో ప్రతి వ్యవస్థ అచేతనంగా మిగిలిపోయింది. ఇందులో వినోద రంగం కూడా ఉంది. సినిమా షూటింగ్స్ పక్కన పెడితే పూర్తయిన సినిమాలు విడుదల ఆగిపోయాయి. ప్రభుత్వాలు సిమాలకు అనుమతులు ఎప్పుడు ఇస్తాయో.. ఇవి ఎప్పుడు ధియేటర్లలోకి వస్తాయో.. వస్తే ప్రజాదరణ ఎలా ఉంటుందో.. సినీ పండితులు కూడా చెప్పలేని పరిస్థితి. ఈ సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పుంజుకుంటున్నాయి. ఈ వేదికపై సినిమాలు విడుదల జరుగుతున్నాయి కూడా. ఈ నేపథ్యంలో ఇద్దరు తమిళ స్టార్ హీరోలు ఓటీటీలో తమ సినిమాల రిలీజ్ విషయంలో ఈ ప్రస్తావనకు నో చెప్పారట.

 

 

తమిళ అనఫీషియల్ నెంబర్ వన్ హీరో విజయ్ చేసిన సినిమా ‘మాస్టర్’. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా ఏప్రిల్ 9నే విడుదల కావాల్సి ఉంది. లాకౌ డౌన్ పరిస్థితుల్లో  ఈ సినిమా విడుదల ఆగిపోయింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ధనుష్ చేసిన ‘జగమే తండిరమ్’ సినిమా కూడా షూటింగ్ పూర్తై మే నెలలోనే విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు వీరిద్దరి సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయాలనే ప్రతిపాదన వచ్చిందట. కానీ.. ఇద్దరు హీరోలు కూడా ఇందుకు ససేమిరా అంటున్నారని కోలీవుడ్ సమాచారం.

 

 

ధియేటర్లో పడే సినిమాకు వచ్చే రెస్పాన్స్ ఓటీటీలో ఎలా వస్తుందనేది వీరి ప్రశ్న. పైగా రెవెన్యూ పరంగా చూస్తే సినిమా బడ్జెట్ కు ఏమాత్రం వర్కౌట్ కాదనేది వీరి అభిప్రాయం. సినిమా టాక్ పై కూడా ప్రభావం చూపుతుందనేదీ వీరి వాదన. పరిస్థితులు చక్కబడ్డాకే సినిమా విడుదల చేద్దామని నిర్మాతలతో అన్నట్టు చెన్నైలో సినీ వర్గాల్లో జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వీరి సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: