తెలుగు సినిమాల మీద ముందు నుంచి కూడా బాలీవుడ్ అంత ఆసక్తి చూపించదు అనేది వాస్తవం. ఎవరో అగ్ర హీరోలు అది కూడా ఎవరు అయినా బాలీవుడ్ నటులు నటిస్తే ఆ సినిమాలను చూడటమే గాని పెద్దగా అక్కడి ప్రేక్షకులు మన సినిమాలను చూసే సాహసం చేయరు. దీని తో మన హీరో లు కూడా అక్కడ సినిమాలు చేయడానికి అంతగా ఆసక్తి చూపించే పరిస్థితి ఉండదు అనేది వాస్తవం. అయితే అక్కడ మన స్టార్ హీరో ప్రభాస్ కి మాత్రం మంచి గుర్తింపు ఉంది అనేది వాస్తవం. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలకు మంచి ఆదరణ వస్తుంది. 

 

ప్రభాస్ సినిమా విడుదల అవుతుంది అంటే చాలు అక్కడి స్టార్ హీరో తో సమానం గా సినిమాలు చూస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత ఈ రేంజ్ అక్కడ ప్రభాస్ కి వచ్చింది అనేది అందరికి తెలిసిన విషయమే. ఇక ఇది పక్కన పెడితే ప్రభాస్ కి అంత క్రేజ్ ఎందుకు అనేది ఒక్కసారి చూస్తే... ప్రభాస్ కి అక్కడ బాలీవుడ్ లో కొంత మంది స్టార్ హీరోలు ఫ్రెండ్స్ ఉన్నారట. వాళ్ళు ఎక్కువగా ప్రభాస్ ని కలుస్తూ ఉంటారని బాలీవుడ్ లో ప్రభాస్ కి బాహుబలి తర్వాత ఈ క్రేజ్ వచ్చింది అని ప్రభాస్ తో సినిమా చేయడానికి అక్కడి నిర్మాతలు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అని అంటారు. 

 

ప్రభాస్ కి కూడా బాలీవుడ్ లో ఒక మంచి సినిమా చెయ్యాలి అనే కోరిక ఎక్కువ. అది ఎప్పటి నుంచో ఉంది. కాని ప్రభాస్ మాత్రం చాలా వరకు అక్కడి సినిమాలను చెయ్యాలి అనుకున్నా సరే దూరంగానే ఉన్నాడు. అక్కడి దర్శకులు అడిగినా సరే తాను చేసేది లేదని ప్రభాస్  పలు మార్లు చెప్పాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: