మాస్ మహారాజ రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది నేల టిక్కెట్టు. కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈచిత్రం ఓపెనింగ్స్ ను కూడా రాబట్టలేకపోయింది. అయితే ఈ సినిమా మాత్రం హిందీ ప్రేక్షకులకు బాగా నచ్చినట్లుంది. ఇటీవల ఈ సినిమాను హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్ లో విడుదలచేయగా ఏకంగా 125మిలియన్ వ్యూస్ ను రాబట్టుకుంది. తెలుగులోఈసినిమాను పట్టించుకోపోయిన హిందీ ప్రేక్షకులు మాత్రం బాగానే ఆదరిస్తున్నారు. 2018లో  వచ్చిన ఈ సినిమాలో మాళవిక శర్మ హిరోయిన్ గా నటించగా జగపతి బాబు విలన్ పాత్రలో నటించాడు. ఎస్ ఆర్ టి ఎంటర్టైనెంట్స్ పతాకం పై రవి తాళ్లూరి ఈసినిమాను నిర్మించాడు. 
 
ఇక  ఈసినిమా తరువాత నాగార్జున తో కళ్యాణ్ కృష్ణ ,బంగార్రాజు చేయడానికి రెడీ అవుతున్నాడు. బ్లాక్ బాస్టర్ మూవీ సోగ్గాడే చిన్నినాయన కు సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఈఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా నేల టిక్కెట్టు తరువాత మరో రెండు డిజాస్టర్లను చవిచూసిన రవితేజ ప్రస్తుతం క్రాక్ లో నటిస్తున్నాడు. గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం లో రవితేజ పోలీస్ పాత్రలో నటిస్తుండగా అతనికి  జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. వీరితోపాటు వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా  ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు.
 
కరోనా లేకుంటే ఈపాటికే విడుదలకావల్సి ఉండేది కానీ ఈ మహమ్మారి వల్ల ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుండడం తో విడుదల వాయిదాపడింది. జులై లేదా ఆగస్టు లో క్రాక్ ను థియేటర్లలోకి తీసుకరానున్నారు. ఇక గత కొంత కాలంగా వరస పరాజయాలను చవిచూస్తున్న రవితేజ, ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: