రెండేళ్ల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత సినిమాతో మంచి హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆ తరువాత నుండి రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో నిమగ్నం అయ్యారు. మరొక నటుడు రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. అయితే కొద్దివారాలుగా మన దేశంలో కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ అమలు అవుతుండడంతో మిగతా షూటింగ్స్ తో పాటు ఆర్ఆర్ఆర్ షూట్ కూడా ఆపేసారు. అయితే ప్రస్తుతం ఓవైపు కొంత విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతోందని, లాక్ డౌన్ అనంతరం షూటింగ్ ని ప్రారంభించి వేగవంతంగా సినిమాని పూర్తి చేస్తాం అని ఇటీవల రాజమౌళి వెల్లడించారు. 

 

వాస్తవానికి ముందుగా ఈ ఏడాది జులై 30న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, గ్రాఫిక్స్ విజువల్స్ వర్క్ పెండింగ్ ఉండడం వలన 2021, జనవరి 8కి వాయిదా పడింది. ఇక ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వలన షూటింగ్ ఆగిపోవడంతో మరొక్కసారి ఈ సినిమా వాయిదా పడే సూచనలు కనపడుతున్నట్లు చెప్తున్నారు. ఎన్టీఆర్ కొమరం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఉన్న రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియో ని రిలీజ్ చేసిన సినిమా యూనిట్, మరొక పదిరోజుల్లో ఎన్టీఆర్ బర్త్ డే ఉండడంతో ఆ రోజున ఆయన ఫస్ట్ లుక్ వీడియో కూడా రిలీజ్ చేస్తారని నందమూరి ఫ్యాన్స్ ఎన్నో ఆశలతో ఉన్నారు. 

 

అయితే అప్పటి పరిస్థితుల్లో రామ్ చరణ్ విజువల్స్ తమ వద్ద ఉండడంతో ఆయన ఫస్ట్ లుక్ వీడియో ని సిద్ధం చేసాం అని, కానీ ఎన్టీఆర్ కు సంబంధించిన ఫుటేజ్ ఆఫీస్ లో ఉండడంతో ఆయన ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేసే అవకాశం చాలా తక్కువ ని ఇటీవల రాజమౌళి అన్నారు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా లాక్ డౌన్ కొనసాగుతుండడంతో అసలు తమ హీరో పుట్టినరోజున కొమరం భీం ఫస్ట్ లుక్ వీడియోని రాజమౌళి రిలీజ్ చేసి మమ్మల్ని ఖుషి చేస్తారో లేక అలా కాకుండా మాకు షాక్ ఇస్తారో అర్ధం కావడం లేదని నందమూరి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మరి ఆ రోజున ఏమి జరుగుతుందో చూడాలి.....!!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: