డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన పోకిరి ఇండస్ట్రీ రికార్డ్స్ ని క్రియోట్ చేసింది. 75 సంవత్సరాల రికార్డ్స్ ని బద్దలు కొట్టడం గొప్ప విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమా... ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ చేయాలి. కాని ఈ ఇద్దరు హీరోలు కాదనుకున్న సినిమా పోకిరి గా తెరకెక్కింది. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని రికార్డ్స్ ని తిరగరాస్తుందని ఈ సినిమాని తెరకెక్కించిన పూరి జగన్నాధ్ గాని, హీరోగా నటించిన మహేష్ బాబు గాని అనుకోలేదు. అయితే మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మాత్రం ఈ సినిమా కొల్లగొట్టే వసూళ్ళని, రికార్డ్స్ ని ముందుగానే అంచనా వేశారు. అంతేకాదు ఈ సినిమాని ఎన్ని రోజుల్లో రిలీజ్ చేస్తావ్.. అని పూరి ని అడిగితే పూరి చెప్పిన సమాధానం 90 రోజుల్లో అని. కాని కృష్ణ గారు ఇంకో 10 రోజులు తీసుకో .. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి అన్నారట.

 

ఇక ఈ సినిమా షూటింగ్ కేవలం 70 రోజుల్లో కంప్లీటవడం ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చలకు తెర తీసింది. దాదాపు సినిమాలో మహేష్ బాబు చేసిన షాట్స్ అన్ని సింగిల్ టేక్ లో ఒకే అయినవే. చెప్పాలంటే పోకిరి సినిమా ఒక చరిత్ర సృష్ఠించింది. ఆ తర్వాత పూరి మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన మరో సినిమా బిజినెస్ మాన్. పూరి వాస్తవిక సంఘటల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారనిపిస్తుంది. ఈ కథ గాని హీరో చేసిన మహేష్ బాబు పాత్ర గాని చాలా మంది జీవితాలలో జరిగిన వాస్తవ సంఘటనలే అనిపిస్తాయి. చాలామంది సినిమా చూశాక అదే భావనకి వచ్చారు. అంతేకాదు ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ అమ్మాయిలకి విపరీతంగా నచ్చడం ఆసక్తికరం. 

 

అయితే మూడో సినిమాగా పూరి మహేష్ బాబు తో తీయాలనుకున్న సినిమా "జనగనమణ". ఈ సినిమా ఉంటుందని చాలా కాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కాని ఎందుకనో ప్రాజెక్ట్ మాత్రం ఫైనల్ కావడం లేదు. కాని ఈ విషయాన్ని బూతద్దంలో పెట్టి చూసేవాళ్ళు మాత్రం చాలామందే ఉన్నారు. ఈ సినిమా చేయకపోవడానికి రక రకాల కారణాలున్నాయంటు సోషల్ మీడియాలో వార్తలు సృష్ఠిస్తున్నారు. ఇక్కడ వాస్తవంగా ఆలోచిస్తే మహేష్ బాబు కి రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు పూరి. అందులో పోకిరి ఇండస్ట్రీ రికార్డ్. అలాంటప్పుడు ఇద్దరి మద్య ఏదో జరిగిందని వార్తలు ఎలా వస్తున్నాయో అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే త్వరలో ఈ సినిమా గురించి న్యూస్ వచ్చే అవకాశముందని తెలుస్తుంది. అయితే పోకిరి 70 రోజుల్లో అలాగే బిజినెస్ మాన్ 60 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసిన పూరి "జనగనమణ" ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: