టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ముందుగా తెలుగు సినిమా పరిశ్రమకు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. కాగా మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న పవన్, ఆ తరువాత వచ్చిన గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు సినిమాల సక్సెస్ లతో అప్పట్లో యువతలో విశేషమైన పేరు ప్రఖ్యాతలు గడించారు. వాటి అనంతరం వచ్చిన బద్రి, ఖుషి సినిమాలు పవన్ కు మరింత గొప్ప ప్రజాదరణను అందించడం జరిగింది. ఇక ఇటీవల రెండేళ్ల క్రితం తన రాజకీయ జీవితంలో బిజీ అయిన పవన్, అంతకముందు వచ్చిన అజ్ఞాతవాసి సినిమాతో మూవీ కెరీర్ కు కొంత బ్రేక్ ని ప్రకటించారు. 

 

అయితే మళ్ళి రెండేళ్ల విరామం తరువాత ప్రస్తుతం మేకప్ వేసుకుని వకీల్ సాబ్ సినిమా తోపాటు పాటు క్రిష్ దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్నారు. వాటి అనంతరం ఆయన మరికొన్ని సినిమాలు కూడా లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. కాగా పవన్ కళ్యాణ్ షూటింగ్ సమయంలో అందరితో ఎంతో కలిసి మెలిసి జోక్స్ వేస్తూ సరదాగా ఉంటారని అందరూ చెప్పడం వింటూనే ఉంటాం. అయితే ఆయన కేవలం భోజనం విరామ సమయంలో మాత్రం ఎక్కువగా ప్రశాంతంగా భోజనం చేయడానికి ఇష్టపడుతుంటారట. దానికి ప్రధాన కారణం పవన్ ఎక్కువగా సాత్విక ఆహారాన్ని తీసుకుంటారని, మొలకలు, సహజమైన కూరగాయలు వంటివి తింటారని, గతంలో రేణు దేశాయ్, అమీషా పటేల్, నికిషా పటేల్ వంటి కొందరు నటీమణులు కొన్ని సందర్భాల్లో వెల్లడించడం జరిగింది. 

 

ఎక్కువగా అటువంటి ఆహారం తీసుకోవడం వలన మనసు, శారీరం ప్రశాంతంగా ఉంటాయని పవన్ చెప్తుంటారట. అందుకే వయసు ఎంత పెరుగుతున్నప్పటికీ కూడా పవన్ ఎప్పుడూ యంగ్ గానే కనపడుతుంటారని తెలుస్తోంది. అయితే ఇటీవల రాజకీయాల్లో బిజీ అయ్యాక తన ఆరోగ్యం పై మాత్రం పెద్దగా దృష్టి పెట్టడం లేదని, ఇక మళ్ళి సినిమాలలో నటిస్తుండడంతో పూర్వం మాదిరి యంగ్ గా కనపడేందుకు పవన్ తన ఫుడ్ విషయంలో పూర్తి శ్రద్ధ వహిస్తున్నట్లు చెప్తున్నారు.,,,,,,!!!

మరింత సమాచారం తెలుసుకోండి: