టాప్ హీరోల పుట్టినరోజు వచ్చిందంటే వారి అభిమానులు చేసే హంగామాకు సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది. సోషల్ మీడియా హడావిడి లేనిరోజులలో పెద్దపెద్ద కటౌట్లు బ్యానర్ లు ప్లెక్సీలు కేక్ కటింగ్ లతో ప్రతి ఊరిలోను హీరోల అభిమానులు హడావిడి చేసేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారడంతో లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితులలో తారక్ అభిమానులు ఈసారి తమ హీరో పుట్టినరోజును సోషల్ మీడియా వేదికగా చాల అట్టహాసంగా జరపబోతున్నారు. 


ఫేవరేట్ హీరోల ఫోటోలను అందరూ కామన్ డీపీలుగా పెట్టుకొని బర్త్ డేని సెలెబ్రేట్ చేసుకోవడం ఒక ట్రెండ్ గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా అదే రేంజ్ లో చాలముందుగా ప్రారంభం అయ్యాయి. ఈనెల 20వ తేదీకి తారక్ 37వ ఏట అడుగు పెడుతున్నపరిస్థితులలో అతడి పుట్టినరోజుకి ఇంకా పదిరోజుల సమయం ఉన్నప్పటికీ ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న హడావిడి కి సోషల్ మీడియా దద్దరిల్లి పోతోంది. 


ఈమధ్య సెలబ్రెటీల బర్త్ డేకి ఆనవాయితీగా వస్తున్న కామన్ డీపి పిక్చర్ తారక్ కోసం రెడీ చేసారు. ఈకామన్ డీపీ ని టాలీవుడ్ లోని 25 మంది ప్రముఖులు నిర్మాణ సంస్థలతో సోషల్ మీడియా వేదికగా విడుదలచేయడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారడమే కాకుండా జూనియర్ కు ఇండస్ట్రీ పై ఉన్న పట్టును సూచిస్తోంది. టాలీవుడ్ హీరోలు రానా దగ్గుబాటి సాయి ధరమ్ తేజ్ కళ్యాణ్ రామ్  నారా రోహిత్ నాగ సౌర్య జగపతి బాబు హీరోయిన్లు కాజల్ అగర్వాల్  రాశీ ఖన్నా మెహరీన్ లాంటి ఎందరో గ్లామర్ బ్యూటీలు మరెందరో ఇండస్ట్రీ ట్విట్టర్ వేదికగా #NTRBirthdayCDP అని రిలీజ్ చేసిన కామన్ డిపి కి హ్యాష్ ట్యాగ్ కు విపరీతమైన స్పందన వస్తోంది. 


రికార్డు స్థాయిలో లైక్ లు వస్తున్న ఈపోష్టర్ నిన్నటి నుండి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దీనితో ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ లోని జూనియర్ పాత్రకు సంబంధించిన వీడియోను విడుదల చేయలేని పరిస్థితులలో ఉన్న రాజమౌళి తన క్రియేటివిటికి మరింత పదును పెట్టి ఎదో ఒకవిధమైన సంచలనం జూనియర్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్ ఆర్ ఆర్’ యూనిట్ నుండి చేయవలసిన ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. దీనితో జక్కన్న ఈఒత్తిడి మధ్య ఎలాంటి క్రియేటివిటీ చూపెదతాడు అన్నవిషయమై ఇండస్ట్రీ వర్గాలతో పాటు జూనియర్ అభిమానులు కూడ చాల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: