టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. అతని సినిమా విడుదల అవుతుంది అంటే ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తారు అనేది కూడా అందరికి తెలిసిందే. తారక్ సినిమా కోసం ఎదురు చూసే స్టార్ హీరోలు కూడా ఉన్నారు అనేది అందరికి తెలిసిన విషయమే. అగ్ర హీరోలు కూడా అతని సినిమాలను ఫ్యామిలీ తో కలిసి చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అతను స్టార్ కుటుంబం నుంచి వచ్చినా సరే ఏ రోజు కూడా నందమూరి అభిమానులను వాడుకున్న సందర్భం అనేది ఎప్పుడు కూడా లేదు అనే చెప్పాలి. 

 

ఏ స్థాయిలో అతని సినిమాలు వచ్చినా సరే ఏ రోజు కూడా తండ్రి హరికృష్ణ ను గాని ఎన్టీఆర్ ని గాని వాడుకున్న సందర్భం లేదు. బాబాయి వరుస సినిమాలు చేస్తున్నా ఆయనను కూడా వాడుకున్న సందర్భం అనేది ఎప్పుడు లేదు. ఆ విధంగా ఎన్టీఆర్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని సినిమాలు చేసాడు. ఎన్టీఆర్ సినిమా అంటే నటన బాగుంటుంది... ఎన్టీఆర్ సినిమా అంటే డాన్స్ బాగుంటుంది ఎన్టీఆర్ సినిమా అంటే కథ బాగుంటుంది అనే అభిప్రాయానికి తీసుకొచ్చి తనకు తాను గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

 

ప్రతీ సినిమా విషయంలో అతను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు అనేది వాస్తవం. కథ ఎంపిక నుంచి ప్రతీ ఒక్కటి కూడా అతను ఎంపిక చేసుకుని సినిమా చేయడమే గాని తన కుటుంబానికి ఉన్న స్టార్ ఇమేజ్ ని వాడుకుని అతను సినిమా చేసిన సందర్భం అనేది ఏ రోజు కూడా లేదు అనేది వాస్తవం. నేడు తారక్ టాలీవుడ్ లో స్టార్ హీరో అయ్యాడు అంటే అది అతని కృషే గాని మరొకరి సహకారం గాని ఫ్యామిలీ మద్దతు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: