సాధారణంగా స్టార్ హీరో కుటుంబం నుంచి ఎవరు అయినా హీరో వస్తే వాళ్లకు ఒక స్థాయిలో రెడ్ కార్పెట్ వేస్తూ ఉంటారు జనాలు. అయినా సరే కొందరు హీరోలు దానిని కాదని తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం కష్టపడి పైకి రావడం కోసం నానా కష్టాలు పడతారు. టాలీవుడ్ లో అలా ప్రయత్నాలు చేసి ఈ మధ్య కాలంలో స్టార్ హీరో గా గుర్తింపు తెచ్చుకున్న హీరో నాగ చైతన్య. నాగ చైతన్య తండ్రి నాగార్జున అయినా సరే ఎక్కడా కూడా తన తండ్రి ఇమేజ్ ని అతను వాడుకుని సినిమా చేసిన సందర్భం అనేది ఎప్పుడు కూడా లేదు అనే చెప్పాలి. 

 

ఏ స్థాయిలో తన తండ్రికి పేరు ఉన్నా సరే తన సినిమాల వరకు దానిని రానీయకుండా కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చాడు. అతను చేసిన కథ లు అన్నీ కూడా భిన్నంగా ఉండటమే గాని  కొత్త దర్శకుల తో సినిమాలు చేయడమే గాని స్టార్ హోదా ఉన్న దర్శకులతో ఏ రోజు కూడా అతను సినిమా చేసిన సందర్భం అనేది లేదు అనే చెప్పాలి. ఆ విధంగా చైతూ తన కంటూ ఒక ముద్ర వేసుకున్నాడు అనేది వాస్తవం. ఏ స్టార్ హీరో కుమారుడు కూడా ఈ స్థాయిలో కష్టపడి సినిమా చేసిన సందర్భం అనేది లేదు అనే చెప్పాలి. 

 

అగ్ర హీరో తన తండ్రి అయినా సరే అతను ఎప్పుడూ కథల ఎంపిక విషయం లో గాని దర్శకుల ఎంపిక విషయంలో గాని తన తండ్రి వరకు వెళ్ళలేదు అనే చెప్పాలి. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే తన సొంత గా తాను చేసాడు గాని... మరొకటి లేదు అనే చెప్పాలి. అలా స్టార్ హీరో అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: