టాలీవుడ్ స్టార్ హీరోల్లో అందగాడు ఎవరంటే అందరూ ముక్తకంఠంతో చెప్పే పేరు 'సూపర్ స్టార్ మహేష్ బాబు'. అతనికి వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే అని మహేష్ ని చూస్తే అర్థం అవుతుంది. ఎవర్ గ్రీన్ హ్యాండ్ సమ్ హీరో అని చెప్పొచ్చు. సూపర్ స్టార్ చార్మింగ్ లుక్.. మెస్మరైజింగ్ స్మైల్ అమ్మాయిల కలల రాకుమారుడిగా చేసింది. ప్రస్తుతం మహేష్ నాలుగు పదుల వయసు దాటి పోయారు. కానీ ఇంకా యంగ్ అండ్ లవర్ బాయ్ రోల్స్ కి ఆయన గెటప్ సెట్ అయ్యేలా ఉన్నాడు. లుక్ లో ఇప్పుడిప్పుడే ఇంట్రడ్యూస్ అవుతున్న హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ పీరియడ్ లో ఇంటిలోనే గడుపుతున్న మహేష్ నిన్న సోషల్ మీడియాలో పోస్ట్ చూస్తే అది గౌతమ్ నా మహేష్ బాబు నా అనే అనుమానం రాకమానదు. అంత యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు మహేష్. నీట్ షేవింగ్ లో తన పెట్ డాగ్స్ తో ఆడుకుంటూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

My big boy turns 9♥️ Awesome time!! #pawsomeparty❤️❤️

A post shared by mahesh Babu (@urstrulymahesh) on

 

మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తన కెరీర్లో 27వ చిత్రాన్ని చేయనున్నాడు. 'సరిలేరు నీకెవ్వరూ' విజయంతో జోష్ మీదున్న మహేష్ వెంటనే నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయాలని ప్లాన్ వేసుకున్నారు. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా అది సాధ్యపడలేదు. దీంతో ఈ సినిమాకి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. అయితే మహేష్ బాబు తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ నెల 31న ఈ సినిమా అఫీసియల్ గా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా మహేష్ మే 31కి తన సినిమాకి సంభందించి ఏదొక అప్డేట్ ఇస్తూ వస్తున్నాడు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్, ఎంబీ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి నిర్మించే ఛాన్సెస్ ఉన్నాయని సమాచారం. ఈ చిత్రం ఏ జోనర్ లో ఉండబోతోందో అనే ఆసక్తి మహేష్ అభిమానులలో నెలకొని వుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ పరశురామ్ మహేష్ బాబు కోసం ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టోరీ సిద్ధం చేశాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో కలవనున్నారు మహేష్. 

మరింత సమాచారం తెలుసుకోండి: