మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన వన్ నేనొక్కడినే మూవీతో తెలుగు తెరకి పరిచయం అయిన భామ కృతి సనన్, బాలీవుడ్ లో సెటిల్ అయింది. మొదటి అవకాశమే స్టార్ హీరోతో వచ్చినప్పటికీ ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో తెలుగులో ఆమెకి పెద్దగా అవకాశాలు రాలేదు. నాగచైతన్య హీరోగా వచ్చిన దోచెయ్ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఇక తెలుగు వైపు ఆమె చూడలేదు.

 

 


అయితే బాలీవుడ్ లో ఆమెకి అవకాశాలు బాగానే వస్తున్నాయి. 'హీరోపంటి' 'దిల్ వాలే' 'లూకా చుప్పి' 'బరేలీకి బర్ఫీ' 'పానిపట్' 'హౌస్ ఫుల్ 4' లాంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం మిమి అనే చిత్రంలో నటిస్తున్న కృతి, ఇండస్ట్రీలో నెపోటిజంపై సంచలన వ్యాఖలు చేసింది. వారసత్వం అనేది బాలీవుడ్ లోనే కాదు. టాలీవుడ్ నుండి మొదలుకుని, బాలీవుడ్, కొలీవుడ్, హాలీవుడ్ అంతటా ఉంది.

 

 


అయితే వార్తసత్వం అనేది సినిమాల్లో ఎంట్రీకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఎంట్రీ ఇచ్చాక తమ టాలెంట్ నిరూపించుకోకపోతే అవకాశాలు సన్నగిల్లుతుంటాయి. ఎంత పెద్ద హీరో కొడుకైనా, బడా నిర్మాణ సంస్థ వారసుడైనా అంకితభావం లేకపోతే విజయాలు దక్కించుకోలేరు. అయితే కృతి సనన్ కామెంట్ చేస్తూ...టాలెంట్ ఉన్నా లేకపోయినా సినీ వారసులకే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని..ఆరోపించింది.

 

 

అవకాశాల కోసం వెళ్ళిన వారి కంటే బ్యాగ్రౌండ్ ఉన్న వారికే అవకాశాలు ఇస్తున్నారని మండిపడుతుంది. ఏ బ్యాగ్రౌండ్ లేని వారికి ఒక్క ఫెయిల్యూర్ వస్తే, మళ్లీ అవకాశాలు రావడం కష్టమవుతుందని, కానీ వారసత్వంతో వస్తున్న వారు మాత్రం టాలెంట్ లేకపోయినా అవకాశాలు తెచ్చుకోగలుగుతున్నారని.. ఇది కరెక్ట్ కాదని వెల్లడించింది. ఈ విషయమై కృతి ఒక్కరే కాదు.. ఇప్పటికి చాలా మంది హీరోయిన్లు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: