'దేవదాస్' సినిమాతో సినీ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాడు రామ్ పోతినేని. ఫస్ట్ సినిమాతోనే ఎనర్జిటిక్ హీరో అనిపించుకున్నాడు. అప్పటి నుండి వరుస సినిమాలతో దూసుకుపోతూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. రెడీ, మస్కా, కందిరీగ, పండగ చేస్కో సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. ఇక 'ఇస్మార్ట్ శంకర్‌' సూపర్ హిట్‌ తో మంచి ఊపు మీదున్నాడు రామ్. ఇప్పటి వరకు మాస్ చిత్రాలను టచ్ చేయని చాక్లెట్ బాయ్ రామ్.. ఫస్ట్ టైం ఫుల్ మాస్ లుక్‌లో అదరగొట్టేశాడు. అటు దర్శకుడిగా పూరీ జగన్నాథ్.. ఇటు హీరోగా రామ్ కెరీర్‌లో నిలిచిపోయే చిత్రంగా మిగిలింది. ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేసిన రామ్ పోతినేని వెంటనే క్రైమ్ థ్రిల్లర్ 'రెడ్' సినిమాను పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా భయం లేకుంటే ఈ 'రెడ్' ఈపాటికి థియేటర్లలో సందడి చేస్తూ ఉండేది. ఏప్రిల్‌లో రిలీజ్ కావలసిన ఈ చిత్రం లాక్‌ డౌన్ కారణంగా వాయిది పడింది. 

 

ఇదిలా ఉండగా రామ్ పోతినేని తమిళ్ పరిశ్రమపై కన్నేశారు. ఆయన తమిళంలో ఓ స్ట్రైట్ అండ్ సాలిడ్ మూవీ చేయాలనుకుంటున్నారట. అన్నీ కుదిరితే ఓ తమిళ్ మూవీ చేయడానికి సిద్ధం అని ఆయన తాజా ఇంటర్వ్యూలో తెలియజేశారు. చెన్నైలో పుట్టి పెరిగిన వాడిగా నాకు తమిళ భాషపై పట్టు వుంది. ఇక తమిళ సినిమా పై గౌరవం, ఆ పరిశ్రమలో మూవీ చేయాలని కోరిక ఉన్నాయని రామ్ చెప్పడం విశేషం.

 

కాగా శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై 'స్రవంతి' రవికిషోర్ 'రెడ్' మూవీని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. పీటర్ హెయిన్స్ యాక్షన్ సీన్స్ డైరెక్ట్ చేస్తున్నారు. గత ఏడాది ప్రారంభమైన ఈ చిత్రం తమిళ మూవీ 'తదమ్' స్టోరీ లైన్ ఆధారంగా రూపొందింది. సినిమా టైటిల్ మాదిరిగానే కథ, కథనం కూడా చాలా కొత్తగా ఉంటాయని దర్శకుడు తిరుమల కిషోర్ వెల్లడించారు. వీరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'రెడ్'. ఇంతక ముందు 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రాలు వచ్చాయి. 'ఇస్మార్ట్ శంకర్' సినిమా తర్వాత రామ్ నుండి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో ఎలాంటి ఫలితాన్ని పొందబోతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: