ప్రభాస్ పేరు తెలుగు పరిశ్రమలో కాదు భారత దేశ వ్యాప్తంగా ఆమె సినీ పరిశ్రమలో చాలా ప్రఖ్యాతి గాంచింది. ఇటీవల కాలం వరకు ప్రాంతీయ హీరో గా కొనసాగిన ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత అంతర్జాతీయ హీరో స్థాయికి ఎదిగాడు. ఉప్పలపాటి సూర్యనారాయణ, శివకుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టాడు. ప్రభాస్ సినీరంగ ప్రవేశం తన పెద్ద నాన్న కృష్ణం రాజు గారి ద్వారా అయ్యిందని మనందరికీ తెలుసు. 2002వ సంవత్సరం లో ఈశ్వర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్ మొదటి సినిమాతోనే హిట్ అనే టాక్ ని సంపాదించుకున్నాడు కానీ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.


ఆ తర్వాత 2003వ సంవత్సరంలో రాఘవేంద్ర అనే టైటిల్ తో సినిమా చేసే పరాజయం పొందాడు. 2004వ సంవత్సరంలో ఎం.ఎస్.రాజు నిర్మాతగా శోబన్ దర్శకత్వంలో విడుదలైన వర్షం సినిమా లో హీరోయిన్ త్రిష సరసన నటించిన ప్రభాస్ కు బాగా పేరు వచ్చింది. ఆరడుగుల ఎత్తు ఉన్న ప్రభాస్ కి ప్రతినాయకుడిగా గోపీచంద్ అదే హైట్ తో సూపర్ గా నటించే ఈ చిత్రాన్ని ఇంకా ఆసక్తికరంగా మార్చాడు. నిజానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. కృష్ణంరాజు కి రెబల్ స్టార్ అనే పేరు ఎప్పటినుంచో ఉండేది. ఆ పేరునే ప్రభాస్ కి యంగ్ రెబెల్ స్టార్ గా మార్చి పిలుస్తారు అభిమానులు.


తదనంతరం ప్రభాస్ ఆర్తి అగర్వాల్ తో జత కట్టి అడవి రాముడు చిత్రం లో నటించాడు. ఈ చిత్రం యావరేజ్ టాక్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత 2005వ సంవత్సరంలో డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఛత్రపతి సినిమాలో హీరోగా నటించాడు ప్రభాస్. ఈ చిత్రంలో ప్రభాస్ మాస్ హీరోగా నటించి సదరన్ ఫిలిమ్ ఇండస్ట్రీ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. రాజమౌళి సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలో యాక్షన్తో పాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా ప్రభాస్ నటించిన తీరు అందరికీ బాగా నచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటించిన శ్రేయ శరణ్ కూడా అద్భుతమైన నటనా చాతుర్యాన్ని చూపించి తన అందచందాలతో కూడా అలరించింది. మళ్లీ ఒక దశాబ్దం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి వన్ టు పార్ట్స్ లలో అద్భుతంగా నటించి అంతర్జాతీయ స్టార్ గా ఎదిగాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: