తెలుగు చిత్ర పరిశ్రమలో  అలనాటి స్టార్ హీరో గా  తెలుగు ప్రజలందరూ దేవుడిగా కొలిచి నా మొట్టమొదటి సినీ నటుడు సీనియర్ ఎన్టీఆర్ కు ఎప్పటికీ ఒక చెరగని ముద్ర ఉంటుంది అన్న విషయంలో తెలిసిందే . చరిత్ర చదవడం కాదు చరిత్ర సృష్టించడం ముఖ్యమంటూ నిరూపించిన గొప్ప వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా... తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన సీనియర్ ఎన్టీఆర్... తెలుగు ప్రేక్షకులందరికీ దేవుడు గా మారిపోయాడు. 

 

 

నిజంగా రాముడు కృష్ణుడు అంటే సీనియర్ ఎన్టీఆర్ ఇలాగే ఉంటారేమో అని ప్రేక్షకులను తన  పాత్రలతో ప్రభావితం చేసాడు సీనియర్ ఎన్టీఆర్. కేవలం సినిమాలలోనే కాదు అటు రాజకీయాలలో కూడా తన సత్తా చాటారు తారకరామారావు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ అంటే నందమూరి తారక రామారావు అనే ఎలుగెత్తిచూపేలా  తన ప్రస్థానాన్ని కొనసాగించారు.

 

 

 ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారకరామారావు అంటే ఒక కారణజన్ముడు అని దర్శక నిర్మాతలు తెలుగు ప్రేక్షకులు తెలుగు ప్రజలు అందరూ అనుకునేవారు. తెలుగు సినిమా ఖ్యాతిని ఎంతగానో పెంచిన   మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు. ఇక తెలుగు వాళ్ళు రాజకీయాల్లో ఎంతటి సత్తా చాటగలరో  నిరూపించిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎదురులేని మనిషిగా ప్రజల దేవుడిగా ఎన్నో దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని ఏలిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు.

మరింత సమాచారం తెలుసుకోండి: