ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వారసులుగా  వచ్చిన ఎంతో మంది హీరోలు స్టార్ హీరోలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలా సివి బ్యాగ్రౌండ్ తో వచ్చి స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో ఒకరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. తనదైన డాన్సులతో డ్రెస్సింగ్ స్టైల్ తో హెయిర్ స్టైల్ తో ఇలా కింద నుంచి మీద  వరకు అడుగడుగునా స్టైల్ గా కనిపిస్తూ ప్రేక్షకుల స్టైలిష్  స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. మొదట్లో సాదాసీదా హీరోగా ఉన్న అల్లు అర్జున్ ఆ తర్వాత క్రమక్రమంగా స్టార్ హీరోగా మారిపోయాడు. మామూలుగా చాలామంది అంటూ ఉంటారు... స్టార్ కిడ్  అయితే స్టార్ హీరో గా మారి పోవడం పెద్ద కష్టమేమీ కాదు అని. 

 

 

 ఇక ఈ వ్యాఖ్యలు ఏకంగా అల్లు అర్జున్ వరకు ఒకానొక సమయంలో వెళితే.. అల్లు అర్జున్ ఈ వ్యాఖ్యలకు బదులిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా అందరికీ క్లారిటీ ఇచ్చేశాడు. స్టార్  బ్యాక్ గ్రౌండ్ నుంచి  చిత్ర పరిశ్రమకు పరిచయం అయినప్పటికీ... చిత్ర పరిశ్రమలో ఉన్న పోటీని నిలదొక్కుకొని తమని తాము నిరూపించుకోవడానికి అందరూ కష్టపడ్డట్టుగానే  ఎంతగానో తాము కూడా కష్టపడాల్సి వస్తుంది అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. 

 

 

 తనకి ఉన్న సినీ బ్యాక్ గ్రౌండ్ అనేది కేవలం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేంత వరకు మాత్రమే ఉపయోగ పడుతుందని ఆ తర్వాత తమని తాము నిలదొక్కుకునేందుకు ఎన్నో కష్టాలు పడాల్సిందే  అంటూ చెప్పుకొచ్చాడు.చాలా మంది బ్యాగ్రౌండ్ ఉంటే చాలు స్టార్ హీరో అయిపోవచ్చు అనుకుంటారని... కానీ స్టార్ హీరో అవ్వడానికి ఎంతో డెడికేషన్...ఎంతో కష్టపడి అందరికంటే కొత్తగా ప్రయత్నించినప్పుడు మాత్రమే అవ్వ గలుగుతాం అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. స్టార్ బ్యాగ్రౌండ్ అనేది కేవలం సినిమాల్లోకి పరిచయం అవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని ఆ తర్వాత మాత్రం సొంత టాలెంట్ ఉండాల్సిందే అంటున్నాడు అల్లు అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి: