ప్రస్తుతం చాలా మంది యువ హీరోలు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ప్రయత్నాలు ఫలించి స్టార్ హీరోగా ఎదిగిన వారు కొంతమంది అయితే ఇంకా ప్రయత్నాలు చేస్తూ మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న వారు  ఇంకొంతమంది  . అయితే సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వడం ఒక ఎత్తయితే ఎంట్రీ ఇచ్చిన తర్వాత పోటీ నిలదొక్కుకొని తమ  సత్తా చాటడం మరో ఎత్తు అన్న విషయం తెలిసిందే. అందుకే ఎప్పుడూ సరికొత్తగా ప్రయత్నిస్తూ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు యువ హీరోలు. 

 

 

 అయితే ప్రొఫెషనల్గా స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆయన సుధీర్ బాబు.. సినిమాలోకి రావాలని ఎంతో ఆసక్తి ఉండేది... ఇక తన బావ మహేష్ బాబు ఇమేజ్ ద్వారా సినిమాల్లోకి పరిచయమయ్యాడు సుధీర్ బాబు. సినిమాల్లోకి పరిచయం అయితే అయ్యాడు కానీ ఆ తర్వాత నిలదొక్కుకోవడం మాత్రం సుధీర్ బాబుకు ఎంతో కష్టం గా మారిపోయింది. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరోలు అందరూ కుప్పలుతెప్పలుగా ఉన్నారు. ఎవరికివారు సరికొత్తగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. 

 

 

 ఈ నేపథ్యంలో సుధీర్ బాబుకు సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ నిలదొక్కుకోవడం కష్టంగా మారిన నేపథ్యంలో అందరి కంటే భిన్నంగా సరికొత్తగా ప్రయత్నిస్తూ తనని తాను ఎప్పుడూ కొత్తగా ప్రేక్షకులకు చూపిస్తూ ప్రస్తుతం స్టార్ హీరోగా మారిపోయాడు సుధీర్ బాబు. బావ మహేష్ బాబు సినీ బ్యాక్ గ్రౌండ్ కేవలం సినీ హీరోగా పరిచయం వరకు మాత్రమే ఉపయోగ పడింది... కానీ ఆ తర్వాత తన యాక్టింగ్ తో అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని... ఎంతగానో  గుర్తింపు సంపాదించాడు సుధీర్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: