తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు స్వశక్తితో పైకొచ్చిన వారే... అలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని సినిమా అవకాశాలను అందుకుంటూ వచ్చిన హీరోల విషయానికొస్తే అతి తక్కువ మంది ఆ జాబితాలోకి వస్తారని చెప్పాలి.. కష్ట పడిన ఏదైనా ఊరికే పోదు అంటారు గా అది ఇదే .. 

 

 

 

 

ఇకపోతే తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం చాలా మంది హీరోలు చాలా కష్టాలను ఎదుర్కొని వచ్చిన వాళ్ళే ఉన్నారు.. అందుకే ఇప్పుడు వరుస విజయాలను అందుకుంటూ వస్తున్నారు.  ఇకపోతే తెలుగు అగ్ర హీరోలు అందరూ కూడా అలా కష్టాలను ఎదుర్కొంటూ పైకొచ్చిన వాళ్ళే .. వారిలో ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా , ఎటువంటి మనీ సపోర్ట్ లేని వారు ఇప్పుడు చాలామంది ఉన్నారు.. 

 

 

 

 

అలా చెప్పుకుంటూ పోతే వరుస లో నాని, రవి తేజ , ఉదయ్ కిరణ్ , నితిన్,దర్శకుడు త్రివిక్రం, సునీల్, వేణు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది వరుసలో వస్తారు.. అందుకే ఇప్పుడు వారి సినిమాలను ప్రజలు ఆదరిస్తున్నారు.. అంతే కాకుండా అభిమానిస్తారు..అలాంటి వారిలో రవితేజ పాత్ర చాలా ప్రముఖమైనది అని చెప్పాలి.. 

 

 

 

 

 

రవితేజ .. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..మొదట సైడ్ యాక్టర్ గా పరిచయమైన , తన నటనతో, డ్యాన్స్ తో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు.. అందుకే ఇప్పుడు మాస్ మహారాజ రవి తేజ గా హవాను కొనసాగిస్తున్నారు..స్టూడియో లంటూ తిరిగి ఒక్క ఛాన్స్ అంటూ కష్ట పడి ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.. ప్రస్తుతం ఆయన వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్నారు.. ప్రస్తుతం క్రాక్ సినిమాలో నటిస్తున్నాడు.  ఆ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: