పవన్ కళ్యాణ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ నిల్చిన చిత్రం గబ్బర్ సింగ్ రిలీజై నేటికి ౮ సంవత్సరాలు కావొస్తుంది. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ సినిమా సూపర్ డూపర్ హిట్ ని అందించింది. విజయం కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకి ఫుల్ మీల్స్ తిన్నంత అనుభూతిని ఇచ్చింది. స్వతాహాగా పవన్ కళ్యాణ్ అభిమాని అయిన హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

 

ఒక సగటు పవన్ కళ్యాణ్ అభిమాని తెర మీద పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలనుకుంటున్నాడో అలా చూపించి శభాష్ అనిపించాడు. అప్పటి వరకూ ఏదో మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ లో ఉన్న అభిమానులు గబ్బర్ సింగ్ లో పవన్ ఆటిట్యూడ్ చూసేసరికి దిమ్మ తిరిగిపోయింది. పవన్ ఆటిట్యూడ్, పలికే డైలాగులు.. ముఖ్యంగా నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది వంటి వన్ లైనర్స్ బాగా పాపులర్ అయ్యాయి. 

 

పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ లో బండ్ల గణేష్ ఈ చిత్రాని నిర్మించారు. నిజానికి ఈ సినిమాని రవితేజ చేయాల్సిందట. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన బాలీవుడ్ మూవీని రీమేక్ చేయమని సోనూసూద్ బండ్లకి సలహా ఇచ్చాడట. సినిమా చూసిన బండ్ల గణేష్, రవితేజని అడిగాడట. కానీ రవితేజ దానికి ఒప్పుకోలేదట. దబాంగ్ సినిమాలోని సల్మాన్ క్యారెక్టరైజేషన్ విక్రమార్కుడు సినిమాలో తన పాత్రకి దగ్గరగా ఉండడం వల్ల వద్దన్నాడట.

 

అప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ కి వినిపించాడట. పవన్ వెంటనే ఓకే చెప్పేయడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. అయితే దబాంగ్ సినిమాకి ఈ సినిమాకి చాలా తేడాలుంటాయి. హరీష్ శంకర్ ఈ సినిమాని పవన్ కళ్యాణ్ అభిమానుల కోసమే చేశాడు. ఆ క్యారెక్టరైజేషన్, డైలాగులు చూస్తే ఇది పవన్ కి తప్ప మరొకరికి సూట్ అవ్వదని తెలుస్తుంది. మొత్తానికి గబ్బర్ సింగ్ సినిమాతో తిరుగులేని బ్లాక్ బస్టర్ అందించాడు హరీష్..

మరింత సమాచారం తెలుసుకోండి: