విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కేవలం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నే కాకుండా ఒకప్పుడు హీరోగా కమెడియన్గా ఎన్నో ఏళ్ల పాటు కొనసాగి తెలుగు చిత్ర పరిశ్రమలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై.. ఆ తర్వాత క్రమక్రమంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుల్లో ముందు వరుసలో ఉంటారు రాజేంద్రప్రసాద్. రాజేంద్రప్రసాద్ నందమూరి తారకరామారావు ఇంటి పక్కనే ఉంటారు. అయితే రాజేంద్రప్రసాద్ ఎప్పుడూ చెబుతూ ఉంటారు. కారణజన్ముడైన అన్నగారు నందమూరి తారకరామారావు గొడ్ల చావడిలో నేను పుట్టాను అంతకంటే అదృష్టం ఏముంది అంటూ చెబుతుంటారు. 

 

 

 అంటే రాజేంద్రప్రసాద్ ప్రస్థానం ఆనాటి గొడ్ల చావిడి నుంచి నేటి స్టార్ నటుడి వరకు వెళ్ళింది అనడంలో అతిశయోక్తి లేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనదైన కామెడీ టైమింగ్ తో దర్శక నిర్మాతలను ఆకర్షించి ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారు రాజేంద్ర ప్రసాద్. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించారు. తర్వాత కాలంలో విలక్షణ నటుడిగా విభిన్నమైన ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ మరింత గుర్తింపు సంపాదించారు రాజేంద్రప్రసాద్. 

 

 హీరోగా కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఎన్నో  పాత్రల్లో  నటిస్తూ ఎంతగానో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక విలక్షణమైన నటుడిగా కొనసాగుతూ... ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు ప్రాణం పోస్తూ నటిస్తున్నారు రాజేంద్ర ప్రసాద్. అయితే ఎన్టీఆర్ గొడ్ల చావడిలో పుట్టడమే తన అదృష్టమని... అదే తనను ఇంతవాడిని చేసింది అంటూ అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్.

మరింత సమాచారం తెలుసుకోండి: